Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Akhil Akkineni : అఖిల్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు.. అమ్మాయి ఎవరో తెలుసా..?

Akhil Akkineni : హీరో అఖిల్ కి నిశ్చితార్థం జరిగి,పెళ్లి క్యాన్సిల్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. అఖిల్,శ్రీయా భూపాల్ నిశ్చితార్థం గ్రాండ్ గా జరిగింది. కాగా ప్రముఖ పారిశ్రామికవేత్త జీవీకే కంపెనీ అధినేత మనవరాలు శ్రీయ. ఇక అఖిల్-శ్రీయా భూపాల్ వివాహం ఇటలీలో జరిపించాలని ఇరు కుటుంబాలు డిసైడ్ అయ్యాయి. కానీ అంతలోనే అఖిల్,శ్రీయ ల మధ్య మనస్పర్థలు వచ్చాయని టాక్ వినిపించింది.

Akhil Akkineni

దీంతో వారిద్దరూ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టకుండానే వారి పెళ్లికి శుభం కార్డు పడింది.కాగా అక్కినేని ఇంటికి త్వరలోనే కొత్త కోడలు రాబోతుందట.ఇంటికి పెద్ద కోడలు గా వచ్చిన సమంత విడాకులు తీసుకొని మధ్యలోనే వెళ్ళిపోయింది. దీంతో నాగార్జున చిన్న కోడలిని తీసుకురావాలని భావిస్తున్నారట. అంటే అఖిల్ పెళ్లి త్వరలోనే చేయాలని అక్కినేని ఫ్యామిలీ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

ఇప్పటికే అఖిల్ పెళ్లి కోసం నాగార్జున మంచి సాంప్రదాయ పద్ధతిలో కలిగిన కుటుంబం నుంచి ఓ అమ్మాయిని చూశారట. ఈ సంబంధం దాదాపు ఫిక్స్ అయినట్టేనని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.సినిమా ఇండస్ట్రీ కి సంబంధం లేని అమ్మాయిని అఖిల్ కోసం ఏరికోరి సెలెక్ట్ చేసారట నాగార్జున.ప్రస్తుతం ఇదే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుంది. మరి ఇది ఎంత వరకు నిజం అనేది తెలియాలంటే దీనిపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేంత వరకు ఆగాల్సిందే.

Advertisement

Read Also : Bigg Boss 6 telugu : యాంకర్ ఉదయభాను బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనుందా!

Exit mobile version