Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Tamanna Love : నటి తమన్నా అతని ప్రేమలో పడింది.. తీరా ప్రపోజ్ చేసే సమయానికి అతను ఏమన్నాడంటే..!

Tamanna Love :  మిల్కీ బ్యూటీ తమన్నా ఒకవైపు సీనియర్ హీరోయిన్ గా ముద్ర వేసుకున్నా ఇప్పటికీ తన అందచందాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది.మూడు పదుల వయసు దాటిపోతున్న చెరగని అభినయంతో,మిల్కీ అందాలతో ఎంతోమందిని మంత్రముగ్ధుల్ని చేస్తూనే ఉంది.ఇప్పటికీ యువ హీరోయిన్లకు పోటీ ఇస్తూ వరుస అవకాశాలను చేజిక్కించుకుంటుంది. సినిమాల్లో మాత్రమే కాదు వెబ్ సిరీస్ లో కూడా నటిస్తూ తన సత్తా చాటుతోంది.

Tamanna _ Actress Tamanna Fell in Love with him What did he say when he proposed to

అంతేకాదు అటు సీనియర్ హీరోలకు ఇటు జూనియర్ హీరోలకు పర్ఫెక్ట్ జోడి అని అనిపించుకుంటుంది ఈ సొగసరి. మరికొన్ని రోజుల్లో వెంకటేష్,వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఎఫ్3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది.ఇకపోతే తన కెరీర్లో ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి బ్లాక్ బాస్టర్ హిట్ లను తన ఖాతాలో వేసుకున్న తమన్నా.. నిజ జీవితంలో మాత్రం ఎన్నో లవ్ ఫెయిల్యూర్ లను ఎదురుకుందట.

Rohini Bazaar Deoghar : ఇదో పురాతన షాపింగ్ మాల్.. ఇక్కడ బట్టల ధర రూ. 30, కూరగాయల సంచి రూ. 100.. అన్నీ చౌకగానే..!

ఎన్నో సార్లు ప్రేమలో విఫలమై బాధలో మునిగిపోయిందట. తమన్నా చదువుకునే సమయంలోనే చిన్ననాటి స్నేహితునితో తొలిసారి ప్రేమలో పడిందట. ఈ క్రమంలోనే ఎన్నో ఆశలతో అతనికి ప్రపోజ్ చేద్దామని ప్లాన్ చేసుకుంటే, అంతకు ముందే అతను తమన్నాను సిస్టర్ అనేసాడట. ఇంకేముంది మిల్కీబ్యూటీకి గుండె బద్దలయినంత పని అయింది. ఆ తర్వాత ప్రేమ జోలికి వెళ్లకుండా సినిమాల్లోకి వచ్చేసింది.

Advertisement

సినిమాల్లోకి వచ్చాక కోలీవుడ్ హీరో కార్తీతో ప్రేమలో పడిందట. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఆవారా సినిమా మంచి విజయం సాధించింది. కానీ ఆ తర్వాత వీరిద్దరి ప్రేమ అనుకోని కారణాలవల్ల బ్రేకప్ అయిందట. ఆ తర్వాత హీరో కార్తీ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోగా, తమన్నా మాత్రం ఇంకా సింగిల్ గానే మిగిలిపోయింది. కార్తీతో బ్రేకప్ నుంచి బయటపడ్డాక విరాట్ కోహ్లీ తో ఈ అమ్మడు డేటింగ్ చేసిందంటూ వార్తలు కూడా వచ్చాయి.

IND vs SA 1st T20I : హార్దిక్ పాండ్యా సిక్సర్లతో సెంచరీ.. కేఎల్ రాహుల్ రికార్డు బ్రేక్.. టాప్ 5లో ఎవరంటే?

Read Also : Bigg Boss 6 telugu : యాంకర్ ఉదయభాను బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనుందా!

Advertisement
e-NAM App : రైతులకు శుభవార్త.. ఇకపై మీ పంటలను ఇంట్లో కూర్చొని గిట్టుబాటు ధరకే అమ్ముకోవచ్చు.. ఈ ప్రభుత్వ యాప్ ఎలా వాడాలో తెలుసా?
Exit mobile version