Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Actress Pragathi : తగ్గేదెలే.. నేను అందగత్తెనే.. ఆ హీరోలపై ప్రగతి షాకింగ్ కామెంట్స్.. ఇదిగో వీడియో..!

Actress Pragathi : సినీనటి ప్రగతి (Pragathi) అనగానే.. అందరికి గుర్తొచ్చేది ఆమె వర్కౌట్లే.. సోషల్ మీడియాలోనూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి వీడియోలకు కుర్రాళ్ల మతిపొగొట్టేస్తున్నాయి. చాలా సినిమాల్లో కుర్ర హీరోలకు అమ్మ పాత్రలో నటిస్తూ అందరిని మెప్పిస్తోంది. సినిమాల్లో చాలా సాఫ్ట్ అనిపించినా.. పర్సనల్ లైఫ్‌లో ప్రగతి ఎంత పాపులర్ అయిందో చెప్పవచ్చు.

Actress Pragathi Shocking Comments on Tollywood Star Heros

సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ సీనియర్ భామ ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. అప్పడప్పుడు సోషల్ మీడియాలో వర్కౌట్ వీడియోలను పోస్టు చేస్తూ నెటిజన్లకు కనువిందు చేస్తోంది. ప్రగతి పలు సినిమాలతో ఫుల్ బిజీగా కనిపిస్తోంది. వరస ఇంటర్వ్యూల్లోనూ ఏదో ఒక షాకింగ్ కామెంట్స్ ప్రగతి వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రగతి కుర్ర హీరోలపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Actress Pragathi :  అదే నాకు పెద్ద ఆస్తి.. అందుకే సినిమాలు చేస్తున్నా..

సీనియర్ నటిగా ప్రగతి ఎన్నో సినిమాలు చేసింది. అయితే తన సినీకెరీర్ ప్రారంభంలో హీరోయిన్ అవకాశాలు బాగానే వచ్చాయట. చాలా మూవీల్లో ప్రగతి నటించింది కూడా. అందులో కొన్ని సినిమాల్లో మాత్రమే ప్రగతి హీరోయిన్‌గా చేసింది. దీనిపై ప్రగతి షాకింగ్ సమాధానం చెప్పింది. హీరోయిన్‌గా ఎందుకు ఎక్కువ మూవీల్లో చేయలేదని అడిగితే.. ‘నేను రజనీకాంత్- కమలహాసన్ వారితోనే హీరోయిన్‌గా చేస్తాను.

Advertisement
Actress Pragathi Shocking Comments on Tollywood Star Heros

ఈ హీరోలతో నేను చేయనని దర్శకుడితో నేరుగా చెప్పినట్టు రివీల్ చేసింది. అందుకే హీరోయిన్ గా అవకాశాలు వచ్చినా చేయకుండా ఇప్పుడు కుర్ర హీరోలకు తల్లిగా నటిస్తోంది. ఇప్పటి హీరోయిన్లకు గ్లామర్ పరంగా గట్టి పోటీ ఇస్తున్నారని అడిగితే.. ‘నేను ఎలా ఉన్నా అందగత్తెనే… ఆ అందం వల్లే సినిమాలు వస్తున్నాయి.. ఆ అందమే నాకు పెద్ద ఆస్తి’ అంటూ ప్రగతి కామెంట్స్ చేసింది. ప్రగతి కామెంట్స్ వీడియో వైరల్ అవుతోంది.

Read Also : RRR Dosti Video : జపాన్‌లో ఆర్ఆర్ఆర్ ప్రభంజనం.. ఎన్టీఆర్, రామ్‌చరణ్ ఫ్యామిలీతో దోస్తీ వీడియో.. ఫ్యాన్స్‌కు పూనకాలే..!

Advertisement
Exit mobile version