Acharya Movie: మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన చిత్రం ఆచార్య. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ థియేటర్లో విడుదలైంది. అయితే విడుదలైన మొదటి రోజే మొదటి షో తోనే నెగిటివ్ టాక్ సొంతం చేసుకొని దారుణమైన కలెక్షన్లను ఎదుర్కొంటోంది.ఇక మొదటి షో తోనే నెగిటివ్ టాక్ సంపాదించుకున్న ఈ సినిమా మెగాస్టార్ కెరీర్లో అతి దారుణమైన కలెక్షన్లను రాబట్టిందని చెప్పాలి. ఫ్రీ బుకింగ్ తో మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 52 కోట్ల గ్రాస్, 35 కోట్ల నికర వసూళ్లను నమోదు చేసింది.
వారాంతం కావడంతో ఎంతోమంది కుటుంబాలతో కలిసి సినిమా వీక్షించే అవకాశాలు ఉన్నాయి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఓవర్సీస్ లో పాజిటివ్ కలెక్షన్లు ఉంటే సినిమా రెండవ రోజు 7.5 కోట్ల నుంచి 8 కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టవచ్చు. ఏదిఏమైనా ఎన్నో అంచనాల నడుమ ఎంతో ప్రతిష్టాత్మకంగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మెగా అభిమానులకు తీవ్ర నిరాశను కలిగించిందని చెప్పాలి.