Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

CAT 2024 Results : క్యాట్ 2024 ఫలితాలు విడుదల.. స్కోరుకార్డు ఇలా డౌన్ లోడ్ చేసుకోండి..!

CAT 2024 Results : అభ్యర్థుల స్కోర్‌కార్డులను పరీక్ష అధికారిక వెబ్‌సైట్ iimcat.ac.inలో అప్‌లోడ్ చేసింది. క్యాట్ 2024 పరీక్షను ఐఐఎమ్ కలకత్తా 24 నవంబర్ 2024న నిర్వహించింది.

By Vinod Kumar

Published on: December 20, 2024 12:31 AM

Updated on: March 14, 2025 6:57 PM

CAT 2024 Results

---Advertisement---

CAT 2024 Results : ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్యాట్ (IIM CAT 2024 Results) 2024 ఫలితాలు వచ్చేశాయి. ఐఐఎమ్ కలకత్తా క్యాట్ 2024 పరీక్ష ఫలితాలను ప్రకటించింది. ఈ పరీక్ష పలితాల్లో 14 మంది విద్యార్థులు 100 పర్సంటైల్ మార్కులు సాధించారు. కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్)కి హాజరైన అభ్యర్థులు ఇప్పుడు తమ స్కోర్‌లను అధికారిక వెబ్‌సైట్ (iimcat.ac.in)లో క్యాట్ అప్లికేషన్ లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌ని ఉపయోగించి చెక్ చేయవచ్చు లేదా డైరెక్ట్ లింక్‌ ద్వారా ఫలితాలను పొందవచ్చు.

అభ్యర్థుల స్కోర్‌కార్డులను పరీక్ష అధికారిక వెబ్‌సైట్ iimcat.ac.inలో అప్‌లోడ్ చేసింది. క్యాట్ 2024 పరీక్ష (CAT 2024 Results)ను ఐఐఎమ్ కలకత్తా 24 నవంబర్ 2024న నిర్వహించింది. దేశవ్యాప్తంగా 385కి పైగా పరీక్షా కేంద్రాల్లో 3 షిఫ్టుల్లో పరీక్ష నిర్వహించారు. అంతకుముందు, ఐఐఎమ్ కలకత్తా డిసెంబర్ 3న పరీక్ష ప్రొవిజనల్ ఆన్సర్ కీని విడుదల చేసింది. ఆ తర్వాత ఫైనల్ ఆన్సర్ కీ డిసెంబర్ 16న విడుదల చేసింది.

3.29 లక్షల మంది రిజిస్టర్ అయిన అభ్యర్థుల్లో 2.93 లక్షల మంది ఇంజినీరింగ్ విద్యార్థులు, పురుష అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. 100 పర్సంటైల్ సాధించిన 14 మందిలో 13 మంది ఇంజనీర్లు ఉన్నారు.

CAT 2024 Results Download
CAT 2024 Results Download

లింగం పరంగా టాప్ సాధించిన వారిలో 13 మంది పురుషులు, ఒక మహిళ ఉన్నారు. మొత్తం 29 మంది అభ్యర్థులు 99.99 పర్సంటైల్ సాధించారు. 25 మంది ఇంజినీరింగ్, నలుగురు నాన్ ఇంజనీరింగ్ బ్యాక్ గ్రౌండ్ కలిగి ఉన్నారు. ఈ గ్రూపులో 27 మంది పురుషులు, కేవలం ఇద్దరు మహిళలు ఉన్నారు. కాగా, 30 మంది విద్యార్థులు 99.98 పర్సంటైల్ సాధించారు.

CAT 2024 Results ఎలా చెక్ చేయాలి? :

  • క్యాట్ 2024 ఫలితాలను ఆన్‌లైన్ మోడ్‌లో చెక్ చేయవచ్చు.
  • ఇందుకోసం, అభ్యర్థులు ఈ కింది ఇచ్చిన విధంగా ఫాలో అవ్వండి.
  • ముందుగా (iimcat.ac.in) వెబ్‌సైట్‌కి వెళ్లండి.
  • ఆ తర్వాత హోమ్‌పేజీలో ఇచ్చిన ‘స్కోర్‌కార్డ్ డౌన్‌లోడ్’ ఎంపికపై క్లిక్ చేయండి.
  • ఇప్పుడు మీ ఐడీ, పాస్‌వర్డ్ సాయంతో లాగిన్ అవ్వండి.
  • స్కోర్‌కార్డ్ మీ స్క్రీన్‌పై PDFరూపంలో కనిపిస్తుంది.
  • మీరు CAT 2024 ఫలితాల పేజీ కోసం దిగువ ఇచ్చిన డైరెక్ట్ లింక్‌ని క్లిక్ చేయొచ్చు.

స్కోర్ కార్డు ఏడాది వరకు చెల్లుబాటు :
క్యాట్ పరీక్ష 2024 స్కోర్‌కార్డ్ వ్యవధి డిసెంబర్ 2025కి పనిచేస్తుంది. ఈ పరీక్ష స్కోర్‌కార్డ్ ఒక సంవత్సరం పాటు చెల్లుబాటు అవుతుంది. క్యాట్ 2024 పరీక్ష (CAT 2024 Results) నవంబర్ 24,2024న 170 నగరాల్లోని 389 పరీక్షా కేంద్రాలలో నిర్వహించారు. మొత్తం పరీక్ష మూడు షిఫ్టులలో జరిగింది.

ఉదయం 8:30 నుంచి 10:30, మధ్యాహ్నం 12:30 నుంచి 2:30, సాయంత్రం 4:30 నుంచి సాయంత్రం 6:30 వరకు జరిగాయి. 120 నిమిషాల పాటు ఈ పరీక్ష కొనసాగింది. ఒక్కో విభాగానికి 40 నిమిషాలు కేటాయించారు. డిసెంబరు 3న ప్రొవిజినల్ ఆన్సర్ కీ విడుదల అయింది. ఫైనల్ కీని డిసెంబర్ 17న రిలీజ్ చేశారు. ఫైనల్ కీలో ఎలాంటి మార్పులు లేవని నిర్ధారిస్తూ అభ్యంతరాల విండో డిసెంబర్ 5 నాటికి క్లోజ్ అయింది.

Read Also : Kidney Stones : శరీరంలో నీరు తగినంత లేకుంటే ఈ ప్రాణాంతక వ్యాధి వస్తుంది జాగ్రత్త.. రోజుకు ఎంత నీరు తాగాలంటే?

, ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!

Amazon Great Freedom Sale : అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026 : వన్‌ప్లస్ 15పై భారీ డీల్.. కొనాలనుకునేవారికి ఇదే గోల్డెన్ ఛాన్స్!

Amazon Great Freedom Sale : అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026 : వన్‌ప్లస్ 15పై భారీ డీల్.. కొనాలనుకునేవారికి ఇదే గోల్డెన్ ఛాన్స్!

Gold Price Today : బంగారం ప్రియులకే పండగే.. భారీగా దిగొచ్చిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడే కొనడం బెస్ట్!

Gold Price Today : బంగారం ప్రియులకే పండగే.. భారీగా దిగొచ్చిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడే కొనడం బెస్ట్!

Hyderabad Metro : రోజూ హైదరాబాద్ మెట్రోలో ప్రయాణిస్తున్నారా? త్వరలో మంత్లీ, క్వార్టర్లీ పాస్‌లు.. విద్యార్థులు, ఉద్యోగులకు భారీ ఊరట!

Hyderabad Metro : రోజూ హైదరాబాద్ మెట్రోలో ప్రయాణిస్తున్నారా? త్వరలో మంత్లీ, క్వార్టర్లీ పాస్‌లు.. విద్యార్థులు, ఉద్యోగులకు భారీ ఊరట!