G
Telugu News » Devotional » if you keep these items at home then there will be no financial difficulties your home
⚡ Devotional, Latest, Topstory

Vastu Tips : ఈ వస్తువులు కనుక ఇంట్లో ఉంచితే ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవు.. మీ ఇంటికి ధన ప్రవాహమే?

Vastu Tips: సాధారణంగా మన భారతీయులు వాస్తు శాస్త్రాన్ని ఎంతగానో నమ్ముతారు. ఈ క్రమంలోనే ఏ పని చేయాలన్నా ముందుగా వాస్తుశాస్త్రం ప్రకారమే ఆ పనులను ప్రారంభిస్తారు.

Tufan9 Telugu NewsAdd as preferredsource on Google

Vastu Tips: సాధారణంగా మన భారతీయులు వాస్తు శాస్త్రాన్ని ఎంతగానో నమ్ముతారు. ఈ క్రమంలోనే ఏ పని చేయాలన్నా ముందుగా వాస్తుశాస్త్రం ప్రకారమే ఆ పనులను ప్రారంభిస్తారు.అయితే మన ఇంటిలో ఏదైనా వాస్తు లోపం ఉన్నప్పుడు ఆ ఇంటిలో నివసించే వారు ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులతో ఎంతో సతమతమౌతూ ఉంటారు.ఇలా ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి పొందాలంటే మన ఇంట్లో కొన్ని రకాల వస్తువులను ఏర్పాటు చేసుకోవడం ఎంతో మంచిదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. మరి ఆ వస్తువులు ఏమిటి అనే విషయం గురించి ఇక్కడ తెలుసుకుందాం…

Vastu Tips

నీలిరంగు శంకువు ఆకారంలో ఉన్నటువంటి 3 పుష్పాలను సోమవారం లేదా శనివారం ఒక కుండలో వేయాలి ఇలా మూడు వారాలపాటు చేయటం వల్ల మన ఇంట్లో ఏర్పడిన వాస్తు దోషాలు తొలగిపోయి లక్ష్మీకటాక్షం కలుగుతుంది. అదేవిధంగా విండ్ చైన్ ను ఇంటిలో వేలాడదీయడం వల్ల గాలికి వాటినుంచి వెలువడే ధ్వని మన ఇంట్లో ఏర్పడిన ప్రతికూల పరిస్థితులను పారద్రోలుతుంది. అదేవిధంగా ఇంటిలో ఉన్నటువంటి వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి.

హిందూ ధర్మశాస్త్రం ప్రకారం గుర్రపు నాడను ఎంతో పవిత్రమైనవిగా భావిస్తారు.ఈ క్రమంలోనే గుర్రపు నాడ ఇంటి ప్రధాన ద్వారానికి మధ్యలో వేలాడదీయడం వల్ల మన ఇంటిలో ఉన్నటువంటి ఎలాంటి వాస్తు దోషాలు అయినా తొలగిపోతాయి. అలాగే ఇంటి నిర్మాణంలో ఉన్నటువంటి దోషాలు తొలగిపోవడమే కాకుండా ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా లక్ష్మీకటాక్షం కలుగుతుంది. క్రాసుల మొక్క దీనినే డబ్బు మొక్క అని కూడా పిలుస్తారు. దీనిని ఇంటిలో ఉత్తర దిశ వైపు పెట్టడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది.ఇక చైనీయులు ఎంతో పవిత్రంగా భావించే లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోవడం ఎంతో మంచిది. ఈ విగ్రహం రెండు ఇంచులకు మించి ఎత్తు ఉండకూడదు.ఇలాంటి విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఇంట్లో లక్ష్మీకటాక్షం కలగడమే కాకుండా ఇంటిల్లిపాదీ ఎంతో సంతోషంగా ఉంటారు.
Read Also :

Ramesh Babu ✓

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.

🏷financial difficultieshindu beliveshomevastu tipsworship
◉f➤𝕏
◉   WhatsApp ChannelJoin Now
➤   Telegram ChannelJoin Now

తాజా వార్తలు