Sai pallavi: టాలీవుడ్ స్టార్ హీరో సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఫిదా సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకు పరిచయం అయిన ఈ అమ్మడు తన అందంతో, నటనతో ప్రేక్షకులను ఫిదా చేసింది. ఇటీవల సాయిపల్లవి నటించిన విరాటపర్వం సినిమా ఈ నెల 17వ తేదీన విడుదల భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సాయి పల్లవి ఇంటర్వ్యూ లో పాల్గొని ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
అమ్మాయిలకు ప్రపోజ్ చేయడానికి బంగారు ఉంగరాలు, రోజా పువ్వులు ఇవ్వాల్సిన అవసరం లేదు. మనస్ఫూర్తిగా ప్రేమను తెలియచేస్తే చాలు అంటూ సాయి పల్లవి చెప్పుకొచ్చింది. వాళ్ల గురించి సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇటీవల సాయి పల్లవి వివాదంలో చిక్కుకుంది. కాశ్మీరీ పండిట్ లను చంపినవారిని గో సంరక్షకులతో పోలుస్తూ సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ విషయం గురించి పలువురు నెటిజన్లు సాయి పల్లవి మీద ఫైర్ అవుతున్నారు. ఇప్పటికే ఈ విషయం గురించి సాయి పల్లవి మీద కేసు కూడా నమోదు అయ్యింది. అయితే ఈ విషయం గురించి సాయి పల్లవి స్పందిస్తూ తాను ఉద్దేశపూర్వకంగా మాట్లాడలేదని ఎవరైనా తన మాటలతో బాధపడి ఉంటే క్షమించాలని క్షమాపణలు చెప్పారు.