Mother and daughter dead bodies: ఇంట్లో నగ్నంగా తల్లీ, కూతుళ్ల మృతదేహాలు..అసలేమైందంటే?

Mother and daughter dead bodies: రోజురోజుకూ నేరాల సంఖ్య పెరిగిపోతుంది. ఎక్కడ చూసినా హత్యలు, దోపిడీలు, దొంగతనాలే. ఒంటరిగా మహిళ కనిపించిందంటే అత్యాచారం చేయడమో, దొంగతనం చేయడమో పరిపాటిగా మారింది. అయితే ఇలాంటి ఘటనే యూపీలో కూడా చోటు చేసుకుంది. అయితే ఉత్తర ప్రదేశ్ వారణాసి పరిధి నారియాకు చెందిన సునీత పాండే కు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉంది. ఈమె భర్త రెండేళ్ల క్రితం అనారోగ్య సమస్యల కారణంగా చనిపోయాడు. అయితే వీరి పెద్ద కుమారుడు అలహాబాద్ హైకోర్టులో పని చేస్తుండగా, చిన్న కుమారుడు ఆంజనేయులు చోలాపూర్ లోని ఓ ఫౌల్ట్రీ ఫాంలో పని చేస్తున్నాడు.

అయితే జులై 13న ఆంజనేయులు స్వగ్రామానికి వచ్చాడు. అయితే ఇంట్లో తల్లీ, చెల్లె మృతదేహాలు నగ్నంగా పడి ఉండడాన్ని చూసి షాకయ్యాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను పట్టుకున్నారు. భదోహి ప్రాంతానికి చెందిన అమన్, అతుల్ విశ్వకర్మ అనే సోదరులు ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో వచ్చి సుత్తెతో మోది తల్లీ, కూతుళ్లను హత్య చేశారు. ఆపై వారింట్లో ఉన్న డబ్బు, బంగారు నగలను తీసుకొని పారిపోయారు.

Advertisement

ఈ క్రమంలోనే వారి ఒంటి మీద నగరు అన్నింటితో పాటు మెబైల్ ఫోన్ లను కూడా తీసుకెళ్లిపోయారు. అయితే ఈ కేసులో నిందితులకు సహకరించిన మరో వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట ్చేశారు. ఈ మిస్టరీని ఛేదించిన వారణాసి పోలీసులను ఉత్తర ప్రదేశ్ డీజీపీ డీఎస్ చౌహాన్ అభినందించారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel