Wife Cheating: ప్రియుడితో లేచిపోయిన భార్య.. ఆ భర్త ఏం చేశాడంటే?

Wife Cheating: పవిత్రమైన వివాహ బంధాన్ని అపహాస్యం చేస్తున్నారు కొందరు ప్రబుద్ధులు. ఇందులో పురుషులు, మహిళలు అన్న బేధమే లేదు. అనవసర సుఖాల వంట పడుతూ చీ అనిపించుకుంటున్నారు. భర్త అందమైన కుటుంబాన్ని వదిలేసి వేరే వ్యక్తితో లేచిపోయింది ఆ పెళ్లాం. ఈ ఘటన ఆంధ్ర ప్రదేశ్ ఉమ్మడి విశాఖపట్నంలోని అనకాపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. నర్సీపట్నంలోని కొత్త వీధికి చెందిన కామిరెడ్డి దుర్గా ప్రసాద్ కు ఓ మహిళతో కొంత కాలం క్రితం పెళ్లయింది. అంతా బాగుందనుకున్న సమయంలో భార్య వేరొకరి మోజులో పడింది. ఎంత చెప్పినా వినకుండా.. ప్రియుడితో లేచిపోయింది. భార్య కోసం పోలీసులకు పిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది.

అయితే భార్య లేచిపోయిందన్న అవమానం భరించలేని దుర్గా ప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసుకొని తన బాధనంతా చెప్పుకున్నాడు. ఆ వీడియోలో ప్రియుడితో కలిసి భార్య చేసిన మోసం.. తనకు ఎదురైన అవమానాలు, పోలీసులు కంప్లెంట్ చేసినా న్యాయం జరగకపోవడం వంటి విషయాలు చెప్పాడు. తన ఆత్మహత్యకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వేడుకున్నాడు.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel