Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Jacqueline fernandez: జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు ఈడీ షాక్.. 7 కోట్ల ఆస్తులు అటాచ్!

వ్యాపార వేత్త సుఖేశ్ చంద్రశేఖర్ కు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు చుక్కెదురైంది. ఈమెకు 7.27 కోట్ల ఫిక్స్ డు డిపాజిట్ ఈడీ

By Vinod Kumar

Published on: April 30, 2022 3:36 PM

Updated on: April 30, 2022 3:36 PM

---Advertisement---

వ్యాపార వేత్త సుఖేశ్ చంద్రశేఖర్ కు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు చుక్కెదురైంది. ఈమెకు 7.27 కోట్ల ఫిక్స్ డు డిపాజిట్ ఈడీ అధికారులు అటాచ్ చేశారు. ఈ కేుసలో ప్రధాన నిందితుడైన సుఖేశ్ చంద్ర శేఖర్.. అతడి భార్య, నటి లీమా మరియూ పాల్ తో పాటు ఆరుగురి పేర్లను ఛార్జ్ షఈట్ లో చేర్చారు. అయితే ఇందులో జాక్వెలిన్ కు కూడా వీరు విలువైన కానుకలు ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.

7 crore assets sezed of Jacqueline fernandez

Advertisement

అయితే రాన్ బాక్సీ మాజీ ప్రమోటర్లు మల్విందర్ సింగ్, శివిందరన్ సింగ్ కు బెయిల్ ఇప్పిస్తానంటూ నమ్మించి వారి భార్యల దగ్గర ఏకంగా 200 కోట్ల రూపాయలు వసూలు చేశాడు సుఖేశ్ చంద్రశేఖర్. అయితే శివిందర్ సింగ్ భార్య అదితి సింగ్ పిర్యాదు మేరకు దిల్్లీ ఆర్థిక నేరాల నిరోధక విభాగం కేసు నమోదు చేసింది. రూ.200 కోట్ల దోపిడీ కేసులో చంద్రశేఖర్​ సన్నిహితుడు లీనా మరియా పాల్​ సహా.. బాలీవుడ్​ హీరోయిన్​ జాక్వెలిన్​ ఫెర్నాండెజ్​ను ఈడీ ప్రశ్నించింది. తిహాడ్​ జైలు నుంచే కాలర్​ ఐడీ స్పూఫింగ్​ ద్వారా జాక్వెలిన్​ ఫెర్నాండెజ్​ను సుకేశ్​ చంద్రశేఖర్ సంప్రదించినట్లు ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ వర్గాలు తెలిపాయి.

తన గుర్తింపును దాచి పెట్టి, తనను తాను పెద్ద పలుకుబడి ఉన్న వ్యక్తిగా పరిచయం చేసుకుని ఆమెతో మాట్లాడేవాడని తెలుసుకున్నారు. అతడిని జాక్వెలిన్​ నమ్మటం ప్రారంభించిన క్రమంలో.. ఖరీదైన పూలు, చాక్లెట్లు బహుమతిగా పంపేవాడని చెప్పారు. సుకేశ్​కు సంబంధించిన 20కిపైగా కాల్​ రికార్డులు ఈడీ దగ్గర ఉన్నట్లు అధికారులు తెలిపారు. రూ.200 కోట్ల దోపిడీ కేసులో దిల్లీ పోలీసు ఆర్థిక నేరాల నిరోధక విభాగం(ఈఓడబ్ల్యూ) విచారణ కొనసాగిస్తోంది. సుకేశ్​ చంద్రశేఖర్​, లీనా పాల్​పై దేశవ్యాప్తంగా 23 చీటింగ్​ కేసులు ఉన్నాయి.

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.