Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Road accident: దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం.. పది మంది దుర్మరణం!

రాజస్థాన్​ ఝున్​ఝునూ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ జీపు.. రోడ్డు పక్కన పార్క్​ చేసి ఉన్న ఓ ట్రాక్టర్​ ట్రాలీపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానిక

By Vinod Kumar

Published on: April 19, 2022 6:37 PM

Updated on: April 19, 2022 6:37 PM

---Advertisement---

రాజస్థాన్​ ఝున్​ఝునూ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ జీపు.. రోడ్డు పక్కన పార్క్​ చేసి ఉన్న ఓ ట్రాక్టర్​ ట్రాలీపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 10 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 8 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు, 108 సిబ్బందికి సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న అంబులెన్స్ సిబ్బంది క్షతగాత్రులను స్థానిక బీడీకే ఆస్పత్రికి తరలించారు. అయితే ఝున్​ఝునూ- గుఢా రోడ్ హైవే​ వద్ద మంగళ వారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది.

10 people dies in road accident at rajasthan

Advertisement

ఓ ఆలయ దర్శనానికి వెళ్లి.. తిరిగివస్తుండగా ఈ దుర్ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషాద ఘటనపై ముఖ్యమంత్రి అశోక్​ గహ్లోత్​ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతులకు నివాళి.. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలు కోవాలని ఆకాంక్షించిన సీఎం.. వారికి మంచి వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :