Samantha : పాన్ ఇండియానా బొక్కనా.. నెటిజన్ ట్వీట్‌కు సమంత రెస్పాన్స్.. వీడియో..!

Updated on: March 28, 2022

Samantha : పుష్ప ఐటెం సాంగ్ ఊ అంటావా మావ.. ఊహు అంటావా అనే సాంగ్‌తో సమంత క్రేజ్ మరింత పెరిగిపోయింది. సమంత పాటకు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రపంచమంతా ఈ పాటకు ఫిదా అయిపోయాయరు. ఇక పాటలో సామ్ కిల్లింగ్ ఎక్స్ ప్రెషన్ చూసి మరింత ఊగిపోయారు జనం.. ఇప్పటికీ సమంత ఊ అంటావా మావ.. ఊహు అంటావా సాంగ్ ట్రెండ్ కొనసాగుతూనే ఉంది. మన దగ్గరే కాదు… విదేశాల్లోనూ ఇదే జోరు కొనసాగుతోంది. లేటెస్టుగా అల్ట్రా మైమీ మ్యూజిక్ ఫెస్టివల్‏లో ప్రదర్శించారు.

ప్రతి ఏడాది మార్చిలో యూఎస్ ఫ్లోరిడాలోని మైమీ పట్టణలో (అల్ట్రా మైమీ పేరుతో) బిగ్గెస్ట్ మ్యూజిక్ ఫెస్టివల్ నిర్వహిస్తుంటారు. ఈ వేడుకలో సమంత ఐటెం సాంగ్ ఊ అంటావా.. ఊహు అంటావా పాటను ప్రదర్శించారు. అయితే ఆ వేడుకకు సంబంధించిన వీడియోను నెటిజన్ షేర్ చేశాడు.. ఇది నమ్మలేనిది.. అసలు ఇది “పాన్ ఇండియానా బొక్కా.. ఇది పాన్ వరల్డ్..” అంటూ ఆ నెటిజన్ సూపర్ పైకి ఎత్తేశాడు.. నెటిజన్ ట్వీట్ చూసిన సమంత రీట్వీట్ చేసింది.. అవునా.. అది నిజమేనా? ఇంతకీ అల్ట్రా మైమీ మ్యూజిక్ ఫెస్టివల్‌లోనా ? అంటూ ఆమె ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది.

Samantha : Samantha tweets pushpa Item song oo antava at ultra miami music festival in us - Tufan Telugu News
Samantha : Samantha tweets pushpa Item song oo antava at ultra miami music festival in us

టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత సినిమాలతో ఫుల్ బిజీ‌గా ఉంది.. తెలుగులో శాకుంతలం మూవీ షూటింగ్ పూర్తి అయింది. యశోధ సినిమా షూటింగ్‏లో సామ్ బిజీగా ఉంది. ఈ మూవీలో సామ్, వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తోంది. తెలుగులోనే కాదు.. కోలీవుడ్, బాలీవుడ్ లోనూ వరుస ఆఫర్లతో సామ్ దూసుకెళ్తోంది. ఒకవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు యాడ్స్ లలో కూడా నటిస్తూ బిజీగా మారిపోయింది. సమంత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూనే ఏదో ఒక దానిపై స్పందిస్తూ ఉంటుంది. విడాకుల తర్వాత చాలా డిప్రెషన్ కు లోనైనప్పటికీ తొందరగానే అందులోనుంచి బయటపడింది. ఇప్పుడు తన కెరీర్ మొత్తాన్ని సినిమాలు, యాడ్స్ తో బిజీగా గడుపుతూ లైఫ్ లీడ్ చేస్తోంది ఈ అమ్మడు..

Advertisement

Advertisement

Read Also : KGF Chapter 2 Trailer : కేజీఎఫ్ 2 ట్రైలర్ వచ్చేసింది.. రెస్పాన్స్ మామూలుగా లేదుగా..!

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel