G
Telugu News » Business » icici bank hikes minimum balance to rs 50k are you affected in telugu
⚡ Business, Latest

ICICI Bank : ఐసీఐసీఐ బ్యాంకు కొత్త రూల్.. ఇక మీ ఖాతాలో మినీమం బ్యాలెన్స్ రూ. 50వేలు ఉంచాల్సిందే.. లేదంటే..?

ICICI Bank Rule : ICICI సేవింగ్స్ అకౌంట్లలో కనీస బ్యాలెన్స్ లిమిట్ పెంచేసింది. ఇప్పుడు ఖాతాదారులు కనీసం రూ. 50,000 బ్యాలెన్స్‌ ఉంచాలి.

Tufan9 Telugu NewsAdd as preferredsource on Google

ICICI Bank Minimum Balance 50K : ఐసీఐసీఐ బ్యాంకు కస్టమర్లకు షాకింగ్ న్యూస్.. ప్రైవేట్ రంగ బ్యాంకు ICICI బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్లలో కనీస బ్యాలెన్స్ పరిమితిని భారీగా పెంచేసింది. ఇప్పుడు ICICI బ్యాంక్ ఖాతాదారులు తమ సేవింగ్స్ ఖాతాలో కనీసం రూ. 50వేలు మినిమం బ్యాలెన్స్‌ను ఉంచుకోవాలి.

ఈ కొత్త రూల్ ఆగస్టు 1, 2025 నుంచే అమలులోకి వచ్చింది. కనీస బ్యాలెన్స్‌కు సంబంధించిన నిబంధనలలో బ్యాంక్ చేసిన మార్పులతో మెట్రో సిటీల నుంచి గ్రామాల వరకు సేవింగ్స్ అకౌంట్లలో కనీస బ్యాలెన్స్ పరిమితిని పెంచింది. ఇప్పుడు మెట్రో, పట్టణ ప్రాంతాలలో కనీసం రూ. 50 వేలు, సెమీ-అర్బన్ ప్రాంతాలలో రూ. 25 వేలు, గ్రామాలలో రూ. 10 వేలు సగటు బ్యాలెన్స్‌ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది.

Advertisement

Read Also : Vivo T4 5G : ఈ వివో స్మార్ట్‌ఫోన్‌‌పై అద్భుతమైన డిస్కౌంట్.. క్రేజీ ఆఫర్లు, ధర ఎంతో తెలిస్తే కొనేస్తారంతే!

గతంలో, మెట్రో, పట్టణ ప్రాంతాల్లో సగటున కనీసం రూ. 10వేలు, సెమీ-అర్బన్ ప్రాంతాల్లోని బ్రాంచులలో రూ. 5వేలు, గ్రామాల్లోని బ్రాంచులలో కనీసం రూ. 2,500 కనీస బ్యాలెన్స్ ఉంచుకోవాల్సి ఉంటుంది. కనీస అకౌంట్ బ్యాలెన్స్ పరిమితి పెంపుతో దేశీయ బ్యాంకులలో ICICI బ్యాంక్ అత్యధిక మినీమం అకౌంట్ బ్యాలెన్స్ (MAB) కలిగి ఉంది.

ICICI Bank : ఇతర బ్యాంకుల కనీస బ్యాలెన్స్ ఎంతంటే? :

ఐసీఐసీఐ బ్యాంక్ సేవింగ్స్ అకౌంటులో కనీస బ్యాలెన్స్ లిమిట్ రూ. 50వేలకు పెంచింది. అదే సమయంలో, ప్రభుత్వ రంగంలో దేశంలో అతిపెద్ద బ్యాంకు ఎస్బీఐ (State Bank Of India) 2020 లోనే సేవింగ్స్ అకౌంట్లలో కనీస బ్యాలెన్స్ నిబంధనను తొలగించింది. మిగిలిన బ్యాంకులు నిర్వహణ ఖర్చు కోసం సేవింగ్స్ అకౌంట్లలో కనీసం రూ. 2వేల నుంచి రూ. 10 వేల వరకు కనీస బ్యాలెన్స్‌ రూల్ పెట్టాయి.

దేశంలోని ప్రైవేట్ రంగంలో అతిపెద్ద బ్యాంకు HDFC బ్యాంక్ విషయానికి వస్తే.. మెట్రో, పట్టణ బ్రాంచ్ సేవింగ్స్ అకౌంట్లలో కనీసం రూ. 10వేలు ఉండాలి. సెమీ అర్బన్ ప్రాంతాల్లోని HDFC బ్యాంకులలో రూ. 5వేలు, గ్రామాల్లోని బ్రాంచులకు రూ. 2500 కనీస బ్యాలెన్స్ ఉంచడం తప్పనిసరి చేసింది.

ICICI Bank : కనీస బ్యాలెన్స్ లేకపోతే ఏమౌతుంది? :

ICICI బ్యాంకు రోజువారీ నిర్వహణ ఖర్చుల కోసం కనీస బ్యాలెన్స్ రూల్స్ తీసుకొచ్చింది. మీరు ఈ లిమిట్ కన్నా తక్కువగా బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే మీరు జరిమానా చెల్లించాల్సి రావచ్చు. ఆగస్టు 1న ICICI బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్లకు కనీస బ్యాలెన్స్ లిమిట్ పెంచింది. బ్యాంకు ఖాతాదారులు తమ బ్యాలెన్స్‌ను వెంటనే చెక్ చేసుకోవాలి. తద్వారా ఎలాంటి పెనాల్టీలు పడకుండా అవసరమైన బ్యాలెన్స్‌ను ఉంచుకోవచ్చు.

Vinod Kumar ✓

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.

🏷Icici bankICICI Bank CustomersICICI Bank Minimum BalanceIcici bank New RuleICICI Bank Savings Account
◉f➤𝕏
◉   WhatsApp ChannelJoin Now
➤   Telegram ChannelJoin Now

తాజా వార్తలు