వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Interesting news: 164 మంది సభ్యుల ఉమ్మడి కుటుంబం.. నెలకు 3 లక్షలు కావాల్సిందే

Interesting news: ఒక కుటుంబంలో ఎంత మంది ఉంటారు. ఈ మధ్య అయితే మనమిద్దరం మనకిద్దరు అనే ధోరణి బాగా పెరిగిపోయింది. అంటే దంపతులిద్దరూ వారికి ఇద్దరు పిల్లలు అనేది చాలా పెరిగిపోయింది. ఉమ్మడి కుటుంబం అంటే తాత, నానమ్మలతో పాటు బాబాయి, పిన్ని, పెద్దనాన్న, పెద్దమ్మ, అమ్మ, నాన్న, వారి పిల్లలు ఇలా అంతా కలిసి ఉండే వారు ఒకప్పుడు. తక్కువలో తక్కువ ఆరుగురు సభ్యులు ఉంటే దానిని చిన్నపాటి ఉమ్మడి కుటుంబం అనే వారు. ... Read more

By Vinod Kumar

Published on: May 17, 2022 7:31 PM

Updated on: December 19, 2025 1:20 AM

---Advertisement---

Interesting news: ఒక కుటుంబంలో ఎంత మంది ఉంటారు. ఈ మధ్య అయితే మనమిద్దరం మనకిద్దరు అనే ధోరణి బాగా పెరిగిపోయింది. అంటే దంపతులిద్దరూ వారికి ఇద్దరు పిల్లలు అనేది చాలా పెరిగిపోయింది. ఉమ్మడి కుటుంబం అంటే తాత, నానమ్మలతో పాటు బాబాయి, పిన్ని, పెద్దనాన్న, పెద్దమ్మ, అమ్మ, నాన్న, వారి పిల్లలు ఇలా అంతా కలిసి ఉండే వారు ఒకప్పుడు. తక్కువలో తక్కువ ఆరుగురు సభ్యులు ఉంటే దానిని చిన్నపాటి ఉమ్మడి కుటుంబం అనే వారు.

ఉమ్మడి కుటుంబాలు కనుమరుగవుతున్న రోజులివి. ఆధునికీకరణ, ఆర్థిక ఉద్యోగ తదితర కారణాల వల్ల చిన్న కుటుంబాలు ఏర్పడుతున్నాయి. ఇటువంటి తరుణంలో కూడా ఓ కుటుంబం ఉమ్మడిగానే జీవిస్తోంది. ఇంతకూ ఆ కుటుంబంలో ఎంత మంది ఉంటారో తెలుసుకుందామా… రాజస్థాన్ లోని నాగౌర్ ప్రాంతంలోని ఆరుగురు అన్నదమ్మలు, మనవళ్లు, మనవరాళ్లు పుట్టినా ఇప్పటికీ కలిసే ఉంటున్నారు.

అన్నదమ్ముల భార్యలు, వారి పిల్లలు, మనవళ్లు, మనవరాళ్లు ఇలా మొత్తం 164 మంది కుటుంబం ఒకే ఇంట్లో నివసిస్తున్నారు. వారి ఇంట్లో మొత్తం 50 గదులు ఉన్నాయి. ఇప్పుడు ఇది చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ కుటుంబాన్ని పోషించాలంటే ఎంత మొత్తంలో డబ్బులు కావాలో తెలిస్తే షాక్ కావాల్సిందే. వీరి నెల వారి నిత్యావసర సరుకుల ఖర్చు.. ఓ సగటు ఉద్యోగి సంవత్సరాదాయానికి సమానం.

సరిగ్గా చెప్పాలంటే ఆ కుటుంబం నిత్యావసర సరుకుల కోసం నెలకు రూ.3 లక్షలు ఖర్చు చేస్తుంది. రోజుకు 30 కిలోల కూరగాయలు, సుమారు 60 కిలోల పిండిని వంట కోసం ఉపయోగిస్తారు. సుమారు 17 మంది మహిళలు వంటింట్లో ఒకరికొకరు సాయం చేసుకుంటారు.

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Join our WhatsApp Channel