Technology News : బ్రౌజింగ్ చేసే విషయంలో గూగుల్ 18 ఏళ్ళు నిండిన వారికి ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయదు. కానీ, 13 ఏళ్లలోపు వాళ్లు మాత్రం ఉపయోగించడానికి వీల్లేదని చెబుతోంది. అయినప్పటికీ అండర్‌ఏజ్‌ను గుర్తించే ఆల్గారిథమ్ లేకపోవడంతో చాలామంది తమ ఏజ్‌ను తప్పుగా చూపించి గూగుల్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలో జరుగుతున్న మోసాలను కట్టడి చేసేందుకు గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది.
టీనేజర్ల విషయంలో యాడ్ టార్గెటింగ్ స్కామ్‌ను నిలువరించే ప్రయత్నం చేయనున్నట్లు తాజాగా ప్రకటించింది గూగుల్. ఈ మేరకు పద్దెనిమిది ఏళ్లలోపు యూజర్లపై టెక్ దిగ్గజం నిఘా వేయనుంది. సాధారణంగా వయసు, లింగ నిర్ధారణ, యూజర్ల ఆసక్తుల ఆధారంగా యాడ్ కంపెనీలు యాడ్‌లను డిస్‌ప్లే చేస్తుంటాయి. ఈ క్రమంలో మోసాలు జరుగుతుంటాయి కూడా. అయితే 18 బిలో ఏజ్ గ్రూప్ వాళ్ల విషయంలో ఈ స్కామ్‌లు జరుగుతుండడంపై గూగుల్ ఇప్పుడు ఫోకస్ చేసింది. ఈ తరహా యాడ్‌లను నిలువరించేందుకు బ్లాక్ యాడ్ ఫీచర్‌ను తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టింది గూగుల్.
ఈ మేరకు యూజర్ యాడ్ ఎక్స్‌పీరియెన్స్‌ను నియంత్రించేందుకు ఈ ఏడాదిలో పలు చర్యలు చేపట్టబోతున్నాం అంటూ గూగుల్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే పిల్లలకు, టీనేజర్లకు సురక్షితమైన బ్రౌజింగ్ అనుభూతి కోసం, ఏజ్ సెన్సిటివిటీ యాడ్ కేటగిరీలను నిరోధించేందుకు చర్యలు చేపట్టాం. ఇక మీద 18 ఫ్లస్ లోపు వాళ్ల విషయంలో మరిన్ని జాగ్రత్తలు పాటిస్తాం అని తాజాగా ప్రకటన విడుదల చేసింది. ఎబౌట్ దిస్ యాడ్ లాంటి మెనూలతో పాటు ఆ యాడ్‌లు ఎందుకు డిస్‌ప్లే అవుతున్నాయో, ఎవరు దానిని ప్రదర్శిస్తున్నారో తెలియజేస్తూ ఫీచర్స్‌ను ఇప్పటికే తీసుకొచ్చింది గూగుల్.
Read Also : Lenovo Mobile : 22GB RAMతో లెనోవో న్యూ మొబైల్… ఇదే అత్యంత పవర్ ఫుల్ ఏమో!
Top 10 Foods Diabetics : చక్కెర, జంక్, గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) ఆహారాలకు దూరంగా ఉండాలి. డయాబెటిక్ ఉన్నవారు…
Varahi Navaratri 2025 : ఈ వారాహి గుప్తనవరాత్రుల్లో పూజలను ఎవరు చేయాలి? అందరూ చేయొచ్చా? ఎవరూ చేయకూడదు? వారాహి…
Ashada Amavasya 2025 : జూలై 25 ఆషాఢ మాసంలో అమావాస్య రోజు. ఈ రోజున పూర్వీకుల ఆత్మలు భూమికి…
Ashadha Amavasya : ఈ రోజు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. పితృ పూజకు ప్రసిద్ధి చెందింది. ఈ రోజున…
WI vs AUS Test : జూన్ 25న బార్బడోస్‌లో ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో వెస్టిండీస్ ఆస్ట్రేలియాకు…
TG EDCET Result 2025 : టీఎస్ EDCET రిజల్ట్స్ 2025 విడుదల అయ్యాయి. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక…
This website uses cookies.