Motorola Frontier: ప్రస్తుత టెక్నాలజీ యుగంలో రోజుకో అప్‌డేట్ కొత్త ఫీచర్లు యూజర్లను ఆకట్టుకుంటున్నాయి. అంతా అరచేతితో హ్యాండిల్ చేయగల స్మార్ట్ వస్తువులు మార్కెట్లో దిగి ప్రజలను మరింత ఆకట్టుకుంటున్నాయి. కాగా ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజ సంస్థ మోటోరోలా సరికొత్త రకం చరవాణిని మార్కెట్లో విడుదల చేయనుంది. మరి దాని అప్‌డేట్లు ఏంటో చూసేద్దామా..!
మోటరోలా ఫ్లాగ్‌షిప్ మొబైల్‌ను త్వరలో లాంచ్ చేయనుంది ఆ సంస్థ. మోటోరోలా ఫ్రంటియర్ (Motorola Frontier) పేరుతో రానున్న ఈ మొబైల్‌కు సంబంధించిన పలు ఫీచర్స్ ఇలా ఉన్నాయి.
మోటోరోలా ఫ్రంటియర్ మొబైల్ 194 మెగాపిక్సెల్ రియల్ కెమెరాతో రానునుట్లు సమాచారం. తొలుత 200 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుందని ముందుగా అంచనాలు వచ్చాయి. అలాగే 144హెట్జ్ రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేతో రానుందని మార్కెట్ వ్యాపారుల అంచనా. మరి ఈ మొబైల్‌కు సంబంధించిన వివరాలను టిప్‌స్టర్ ఇవాన్ బ్లాస్ వెల్లడించారు.
ఫీచర్లు ఇవే :
- 6.67 ఇంచుల ఫుల్ హెచ్‌డీ+ OLED డిస్‌ప్లే విత్ 144 హెట్జ్ రిఫ్రెష్ రేట్
- స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 అప్‌గ్రేడెడ్ వెర్షన్ చిప్‌సెట్
- LPDDR5 12జీబీ ర్యామ్
- 194 ఎంపీ+50 ఎంపీ +12 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా
- 60 ఎంపీ ఫ్రంట్ కెమెరా
- 4500mAh బ్యాటరీ
- 125వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్
- 50 వాట్ల వైర్‌లెస్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్టు
- వైఫై 6ఈ
- యూఎస్‌బీ టైప్-సీ
- బ్లూటూత్ వీ5.2 కనెక్టివిటీ మరి త్వరపడండి. ఈ మొబైల్‌కు సంబంధించిన రేట్లుకూడా ప్రజలకు అందుబాటులోనే ఉంటాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాగా ఎప్పుడు లాంచ్ అవుతుంది. ఎంత ప్రైజ్ ఉంటుంది. ఇలాంటి సమాచారం కోసం మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే.
Tufan9 Telugu News And Updates Breaking News All over World