Technology News : కంప్యూటర్, ల్యాప్ టాప్ వంటి ఏ డివైజ్ రన్ కావాలన్నా తప్పనిసరిగా అందులో ఆపరేటింగ్ సిస్టమ్ ఉండాల్సిందే. ఆపరేటింగ్ సిస్టమ్ అనగానే ఎక్కువ మందికి గుర్తొచ్చేది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. విండోస్ 7 వెర్షన్ నుంచి కొత్తగా వచ్చిన విండోస్ 11 గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటికే మైక్రోసాఫ్ట్ దిగ్గజం విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టమ్ సెక్యూరిటీ అప్ డేట్స్ నిలిపివేసింది. అయినప్పటికీ చాలామంది విండోస్ యూజర్లు ఇప్పటికీ విండోస్ 7 వాడుతున్నారు. యూజర్లకు తగినట్టుగానే కొత్త ఫీచర్లతో లేటెస్ట్ వెర్షన్ ఆపరేటింగ్ సిస్టమ్‌లను మైక్రోసాఫ్ట్ రిలీజ్ చేస్తోంది.
విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆపరేటింగ్ సిస్టమ్‌తో విండోస్ అనేక రకాల ఫీచర్లను ప్రవేశపెట్టింది. అందులో ఫీచర్లను వినియోగించుకోవాలంటే కచ్చితంగా మీ కంప్యూటర్లలో స్పెషల్ ఫీచర్లు ఉండాల్సిందే. ఇలాంటి ఫీచర్లు అందుబాటులో లేని వారికి కూడా విండోస్ 11 సర్వీసులు అందుబాటులోకి తీసుకొచ్చింది మైక్రోసాఫ్ట్. విండోస్ 11 యూజర్లను మైక్రోసాఫ్ట్ అలర్ట్ చేస్తోంది. విండోస్ 11 ఉపయోగిస్తున్న యూజర్లకు ఒక అలర్ట్ మెసేజ్‌ను పంపుతోంది మైక్రోసాఫ్ట్. ప్రత్యేకమైన ఫీచర్లు లేని కంప్యూటర్లకు విండోస్ 11 తో పనిచేసేందుకు మీ సిస్టమ్ రిక్వైర్‌మెంట్స్ సరిపోవు’ అనే అలర్ట్‌ను పంపుతోంది.
విండోస్ 11 ఉపయోగించాలంటే మీ కంప్యూటర్‌లో ‘Learn More’ అనే లింక్‌ను అందిస్తోంది. ఈ లింక్ ద్వారా యూజర్లు తమ కంప్యూటర్లలో అవసరమైన System Requirements ఉండాలని మైక్రోసాఫ్ట్ సూచిస్తోంది. విండోస్ 11కు అవసరమైన ఫీచర్లు లేకుండా OS ఉపయోగిస్తుంటే ఫ్యూచర్‌లో మైక్రోసాఫ్ట్ విడుదల చేసే అప్‌డేట్స్ సిస్టమ్‌కు సపోర్ట్ చేయవని అంటోంది. యూజర్ల డేటాకు సైబర్ దాడుల నుంచి రక్షణ ఉండదని మైక్రోసాఫ్ట్ చెబుతోంది. యూజర్లు తమ డివైజ్‌లను Windows 11కి అప్‌గ్రేడ్ చేసుకోవాలని సూచిస్తోంది. కంప్యూటర్లలో విండోస్ 11 రన్ చేయాలంటే ముందుగా వారి సిస్టమ్ లోని రిజిస్ట్రీకి లో కొన్ని సవరణలు చేయాల్సి ఉంటుంది అలా చేసేవారికి Microsoft అధికారికంగా హెచ్చరించింది. ఇటీవలి విండోస్ ఇన్‌సైడర్ ప్రివ్యూ బిల్డ్‌లలో వార్నింగ్ మెసేజ్ పంపిస్తోంది. ఈ బిల్డ్‌లలోని సెట్టింగ్‌ల యాప్ హెడర్ సపోర్టు చేయదంటూ యూజర్లకు మెసేజ్ అలర్ట్ కనిపిస్తుంటుంది.
IRCTC Down : ప్రముఖ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC)సైట్, యాప్ గురువారం (డిసెంబర్ 26)…
ICAI CA Final Result 2024 : ICAI CA ఫైనల్ రిజల్ట్స్ నవంబర్ 2024 లైవ్ అప్‌డేట్స్ :…
Earthquake AP : ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ భూమి కంపించింది. రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో స్వల్ప భూకంపం సంభవించింది. భూమి ఒక్కసారి…
Earthquake Nepal : మన పొరుగు దేశం నేపాల్‌లో తెల్లవారుజామున భూకంపం సంభవించింది. నేపాల్‌లో శనివారం ఉదయం 4.8 తీవ్రతతో…
Is Bank Open Today : ఈరోజు బ్యాంకులకు హాలిడే ఉందో లేదో తెలియదా? వారాంతాల్లో ఆర్థిక లావాదేవీలను పూర్తి…
Om Prakash Chautala : హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాష్ చౌతాలా ఇకలేరు. ఇండియన్ నేషనల్ లోక్ దళ్…
This website uses cookies.