తెలంగాణ వ్యాప్తంగా రైతు బంధు సంబరాలు కొనసాగుతున్నాయి. 64 లక్షల మంది అన్నదాతలకు 50 వేల కోట్ల పెట్టుబడి అందించింది తెలంగాణ ప్రభుత్వం. దీంతో రైతులు సంక్రాంతికి ముందే సంబరాల్లో మునిగి తేలుతున్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో రైతు బంధు సంబరాలు జోరుగా సాగుతున్నాయి. సంక్రాంతి వరకు రైతు బంధు సంబరాలను కొనసాగించాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. రైతుబంధు నిధులు అన్నదాతల ఖాతాల్లో చేరడంతో తెలంగాణలో సంక్రాంతి ముందే వచ్చిందన్నారు కేటీఆర్. రైతు బంధు పథకం సీఎం కేసీఆర్ మానస పుత్రిక అన్నారు.
ఈ పథకం కింద 64 లక్షల మందికి 50 వేల కోట్ల పెట్టుబడి సాయం అందించామన్నారు టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. తెలంగాణ కోటి రతనాల వీణే కాదు ముక్కోటి ధాన్యాలు పండిస్తున్న రాష్ట్రం కూడా అని అన్నారు. రైతుబంధు సంబరాల్లో బిజెపి, కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడ్డారు కేటీఆర్. కొంత మంది పొలిటికల్ టూరిస్టులు ఏవేవో మాట్లాడుతున్నారని, పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. రైతుబంధు పథకాన్ని విమర్శిస్తున్న ప్రతిపక్షాలకు కూడా సాయం అందుతోందని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇలాంటి పథకం ఉంటే చెప్పాలని సవాల్ విసిరారు మంత్రి కేటీఆర్.
సీఎం కేసీఆర్ కు తెలంగాణ రైతుల పై ప్రేమ ఉంది కాబట్టే రైతుబంధు అందిస్తున్నారన్నారు మంత్రి హరీష్ రావు. బిజెపికి అన్నదాతల పై ప్రేమ ఉంటే దేశమంతటా రైతు బంధు అమలు చేయాలన్నారు. రైతుల ఖాతాల్లో నగదు జమ చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు పలు జిల్లాల్లో రైతుబంధు వేడుకలను వినూత్నంగా జరుపుతున్నారు టిఆర్ఎస్ నేతలు. వరి నారు తో కేసీఆర్, కేటీఆర్ చిత్ర పటాలను తయారు చేశారు. ట్రాక్టర్ ర్యాలీలతో హోరెత్తించారు.
Summer AC Tips : ఏదైనా ఏసీని కొనుగోలు చేసే ముందు ఈ సూచనలను పరిగణనలోకి తీసుకోవాలి. మీకోసం 4…
Poco C71 Launch : భారత మార్కెట్లో Poco C71 మోడల్ 4GB + 64GB బేస్ కాన్ఫిగరేషన్ ధర…
Realme 13 Pro Price : రియల్‌మి 13 ప్రో ఫోన్ 8GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర…
CSK vs RCB : ఐపీఎల్ 2025లో ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) చెన్నై సూపర్…
Airtel IPTV Plans : ఎయిర్‌టెల్ 2వేల నగరాల్లో IPTV (ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్) సర్వీసును ప్రవేశపెట్టింది. హై-స్పీడ్ ఇంటర్నెట్,…
Spinach : పాలకూర ఆరోగ్యకరమైన కూరగాయలలో వస్తుంది. ఇది అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందించే అన్ని ముఖ్యమైన పోషకాలతో నిండి…
This website uses cookies.