...

Aadhar Mobile Number: ఆధార్ కార్డ్ మొబైల్ నెంబర్ కు లింక్ చేశారో మర్చిపోయారా.. అయితే ఇలా తెలుసుకోండి!

Aadhar Mobile Number: భారత దేశంలో ప్రతి ఒక్క పౌరుడికి అత్యంత ముఖ్యమైన తప్పనిసరి డాక్యుమెంట్లలో ఆధార్ కార్డు ఒకటి. పుట్టిన పిల్లల నుంచి ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డ్ ఎంతో కీలకంగా మారింది. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వాటి గురించి అయినా లేదా ప్రైవేట్, బ్యాంకింగ్ సేవల కోసం తప్పనిసరిగా ఆధార్ అవసరమవుతుంది. ప్రస్తుతం ఆధార్ లేకుండా ఏ పని కూడా సాధ్యపడటం లేదు. అయితే ఆధార్ కలిగి ఉన్న ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఆధార్ మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవాలి.అయితే కొందరు వారి ఆధార్ నెంబర్ ను ఏ మొబైల్ నెంబర్ కి లింక్ చేశారనే విషయం మర్చిపోయి ఉంటారు.

Advertisement

ఈ విధంగా ఆధార్ మొబైల్ లింక్ మర్చిపోయిన వారు ఏ మాత్రం కంగారు పడకుండా ఎంతో సులభంగా మనం ఏ మొబైల్ నెంబర్ కి అయితే ఆధార్ లింక్ చేసామో సులభంగా తెలుసుకోవచ్చు. అదెలానో ఇక్కడ తెలుసుకుందాం..

Advertisement

ముందుగా మన మొబైల్ ఫోన్లో ఏదైనా బ్రౌజర్‌ను ఓపెన్‌ చేసి అధికారిక వెబ్‌సైట్‌ యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (UIDAI)ను సందర్శించండి. ఇక్కడ మై ఆధార్ సెక్షన్లో ఆధార్ సర్వీస్ లో మొబైల్ నెంబర్ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. ఈ విధంగా సెలెక్ట్ చేసిన తర్వాత ఒక కొత్త ఫేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మన ఆధార్ నెంబర్ అలాగే, ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి.
తర్వాత క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన Send OTP పైన క్లిక్ చేయాలి. మీరు సరైన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఉంటే మీ ఆధార్ కార్డ్ నెంబర్ తో అనుసంధానం అయిందని మనకు చూపెడుతుంది. ఒకవేళ అనుసంధానం కాకపోతే అనుసంధానం కాలేదని చూపిస్తుంది. దీంతో మరోక ఫోన్ నెంబర్ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మన ఆధార్ కార్డ్ ఏ ఫోన్ నెంబర్ పై లింక్ చేయబడి ఉందో సులభంగా తెలుసుకోవచ్చు.

Advertisement
Advertisement