Hyderabadi haleem
Hyderabadi haleem : హలీమ్.. ప్రత్యేకంగా రంజాన్ సీజన్ లో దొరికే ఈ వంటకం అంటే చాలా మంది ఇష్టపడతారు. రంజాన్ మాసం ఆరంభం అయ్యాక విధి విధికి, గల్లీ గల్లీకి ఒక హలీమ్ దుకాణం వెలుస్తుంది. ప్రతి దుకాణం వద్దా ఎప్పుడు జనాలు కనిపిస్తూనే ఉంటారు. ఈ వంటకాన్ని చాలా మంది చాలా ఇష్టంగా తింటారు. హలీమ్ ఎంతో రుచిగా ఉంటుంది. అందుకే దీని పేరు వింటే చాలు చాలా మందికి నోరూరుతుంది. అలాగే ఇందులో పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. అసలు హలీమ్ అంటే.. మటన్‌తో చేసే వంటకం. కానీ ఇప్పుడు చికెన్‌తో కూడా చేస్తున్నారు. శాఖాహారుల కోసం వెజిటెబుల్ హలీమ్ కూడా అందుబాటులోకి వచ్చింది. ఎన్ని వచ్చినా.. మటన్ హలీమ్ తింటేనే.. దాని అసలైన రుచిని ఆస్వాదించగలం.
మొఘల్ చక్రవర్తుల కాలంలో మన దేశంలోకి వచ్చిన హలీమ్ వంటకాన్ని హైదరాబాద్ తన సొంతం చేసుకుంది అనడంలో అతిశయోక్తి లేదు. చరిత్రకారులు ఎవరైనా హలీమ్ పుట్టినిల్లుగా హైదరాబాద్‌నే చెబుతారు. హలీమ్ వంటకం మొఘలుల నుండి వచ్చినా.. దానిని పెద్ద పీట వేసింది మాత్రం నిజాం ప్రభువులే అని చెప్పాలి. హలీమ్ పూర్తిగా మటన్‌తో చేసే వంటకం కావడంతో ఇందులో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అందుకే హలీమ్‌ను శక్తివంతమైన పదార్థంగా గుర్తించారు. హలీమ్ రుచిగా కూడా ఉండటంతో నిజామ ప్రభువులు ప్రీతిపాత్రంగా భావించారు.
అప్పటి నుండి హలీమ్ తన రూపును కొద్ది కొద్దిగా మార్చుకుంటూ వచ్చింది. హైదరాబాద్‌లో దొరికే ప్రత్యేక మసాలా దినుసులు జోడించడంతో పక్కా లోకల్ ఫ్లేవర్ దానికి యాడ్ అయింది. దీంతో హలీమ్ చాలా మందికి నచ్చడం మొదలైంది. ఒకప్పుడు ప్రభువులకే పరిమితమైన ఈ వంటకం… ఇప్పుడు సాధారణ ప్రజలకూ చేరువైంది. హైదరాబాద్‌లో తయారు చేసే హలీమ్‌లో మన దగ్గర దొరికే మసాలా దినుసులను ఎక్కువగా వాడతారు. దీంతో హలీమ్ మంచి రుచిగా తయారైంది. ప్రస్తుతం హైదరాబాదీ హలీమ్‌కు ప్రపంచవ్యాప్తంగా ఎంతో డిమాండ్ ఉంది. ఇక్కడ తయారయ్యే హలీమ్.. మలేషియా, సింగపూర్, సౌదీ అరేబియా దేశాలకు ఎక్స్పోర్ట్ అవుతుంది. అక్కడి వారు మన హలీమ్‌ను ఎంతో ఇష్టపడి తింటారు.
Read Also :Temple Pulihora : నోరూరించే పులిహోర.. అచ్చం గుడిలో తయారుచేసినట్టే చేయొచ్చు.. ఇలా ట్రై చేయండి..!
Top 10 Foods Diabetics : చక్కెర, జంక్, గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) ఆహారాలకు దూరంగా ఉండాలి. డయాబెటిక్ ఉన్నవారు…
Varahi Navaratri 2025 : ఈ వారాహి గుప్తనవరాత్రుల్లో పూజలను ఎవరు చేయాలి? అందరూ చేయొచ్చా? ఎవరూ చేయకూడదు? వారాహి…
Ashada Amavasya 2025 : జూలై 25 ఆషాఢ మాసంలో అమావాస్య రోజు. ఈ రోజున పూర్వీకుల ఆత్మలు భూమికి…
Ashadha Amavasya : ఈ రోజు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. పితృ పూజకు ప్రసిద్ధి చెందింది. ఈ రోజున…
WI vs AUS Test : జూన్ 25న బార్బడోస్‌లో ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో వెస్టిండీస్ ఆస్ట్రేలియాకు…
TG EDCET Result 2025 : టీఎస్ EDCET రిజల్ట్స్ 2025 విడుదల అయ్యాయి. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక…
This website uses cookies.