Temple Pulihora : పులిహోర.. ఈ పేరు వింటేనే చాలు.. నోటిలో లాలాజలం ఊరిపోతుంది. పుల్లటి పులిహోరను తినాలని ఎవరికి ఉండదు చెప్పండి.. అందులోనూ దేవాలయాల్లో తయారుచేసే పులిహోర.. ఆ టేస్టే వేరు.. అంత రుచికరంగా ఉంటుంది. అయితే గుళ్లలో తయారుచేసే పులిహోరా ఇంట్లో చేసుకోలేమా అంటే.. తప్పక చేసుకోవచ్చు. అచ్చం గుళ్లో చేసినట్టుగానే పులిహోరను ఎలా తయారుచేయాలో తెలుసా? అయితే ఇప్పుడు తెలుసుకుందాం.. ఒకసారి పులిహోర ఇలా తయారుచేశారంటే.. మిగిలితే ఒట్టు.. కొంచెం కూడా మిగల్చకుండా లొట్టలేసుకుంటు తినేస్తారు..
అంతేకాదండోయ్.. ఆఫీసులకు లేదా దూర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు ఇది లంచ్ బాక్స్ లోనూ పులిహోరను తీసుకెళ్లవచ్చు. ఒకవైపు ప్రయాణం చేస్తూ మరోవైపు పులిహోరను తింటూ ఆహా.. ఊహించుకుంటేనే ఎంతో థ్రిల్లింగ్ అనిపిస్తుంది కదా… సాధారణంగా ఇళ్లలో ఎక్కువగా పులిహోరను ఇష్టపడేవారు ఉంటారు. వారిని ఇంట్లో వాళ్లు కూడా పులిహోర బ్యాచ్ అంటూ ఆట పట్టించడం చూసే ఉంటారు. మీరూ కూడా పులిహోర ఫ్యాన్స్ అయితే.. మీ పిల్లలకు లేదా ఇంట్లో వారికి రుచికరమైన పులిహోరను ఎలా తయారుచేసి వడ్డించాలో ఒక్కొక్కటిగా తెలుసుకుందాం..
పులిహోర తయారీకి కావాల్సిన పదార్థాలు..
చింతపండు, పల్లీలు, ఎండు మిరపకాయలు, జీలకర్ర, మిరియాలు, కరివేపాకు, మెంతులు, నూనె, ఆవాలు తప్పనిసరిగా ఉండాలి. అప్పుడే ఆ పులిహోర అద్భుతంగా వస్తుంది. ఇప్పుడు మీరు చేయాల్సిందిల్లా.. స్టవ్‌పై ఒక గిన్నెను పెట్టండి.. అందులో ముందుగా పల్లీలు, మిరియాలు, మెంతులు, జీలకర్ర, శనగపప్పును ఒక్కొక్కటిగా వేయించి పెట్టుకోవాలి.
అలా వేయించుకున్న వాటిని పక్కన పెట్టుకోండి.. ఇప్పుడు మీరు అదే గిన్నెలో నూనె పోయండి.. అప్పటికే నానబెట్టుకున్న చింతపండు గుజ్జు మిశ్రమాన్ని వేసి వేయించుకోవాలి. ఆపై కరివేపాకును కూడా అందులోనే వేయించాలి. ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని వేయించిన ఎండు మిరపకాయలతో కలిపి గ్రైండ్ చేసుకోవాలి. అలాగే పోపు గింజలు, కరివేపాకు, పసుపు కూడా కలిపి మొత్తం గ్రైండ్ చేసుకోవాలి.
మీకు దేవాలయాల్లో పులిహోర మాదిరిగా కావాల్సిన పులిహోర పొడి రెడీ అయినట్టే.. చివరిగా.. పోపు తాలింపు కోసం.. ఒక గిన్నెలో నూనె పోసి.. తయారుచేసుకున్న పులిహోర పొడితోపాటు శనగపప్పు, ఆవాలు, ఎండు మిరపకాయలు, కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి. మీరు గుర్తించుకోవాల్సిన విషయం మరొకటి ఉంది… ఈ పులిహోర మిశ్రమాన్ని తయారుచేయడానికి ముందే.. మీరు అన్నం వండేటప్పుడే పలుకుగా ఉండేందుకు కొంచెం నూనె (తగినంత)ను వేసుకోవాలి. ఇప్పుడు వండి పెట్టుకున్న అన్నంలో పులిహోర పొడి మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. అంతే.. టెంపుల్ స్టైల్ పులిహోర రెడీ..
Read Also : Devotional Tips : శని ప్రభావం మన ఇంటిపై ఉండకూడదు అంటే ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఈ మొక్క ఉండాల్సిందే!
Tufan9 Telugu News providing All Categories of Content from all over world