...

Karthika Deepam: జ్వాలాపై కోపంతో రగిలిపోతున్న స్వప్న..ఆనందంలో హిమ,నిరూపమ్..?

Karthika Deepam: తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో ఒక దొంగ సౌర్య డబ్బులు కొట్టేయడంతో అది చూసిన సౌందర్య ఆ దొంగను పట్టుకుని డబ్బులను సౌర్య కి తిరిగి ఇచ్చేస్తుంది.

Advertisement

ఈరోజు ఎపిసోడ్ లో ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలో జ్వాలా చిత్తుకాగితాలు తీసుకుని అక్కడి నుంచి వెళ్లి పోతుంది. అప్పుడు చిత్తు కాగితాలు అనే వ్యక్తికి జ్వాల బొమ్మ దొరకడంతో ఇప్పుడు వచ్చిన అమ్మాయి ఫోటో నే కదా అని అనుకుంటూ ఉంటాడు.. మరొకవైపు స్వప్న, సత్య ల పెళ్లి రోజు సందర్భంగా ఎలా అయినా వారిద్దరిని కలపాలి అని నిరూపమ్ ఆలోచిస్తూ ఉంటాడు.

Advertisement

Advertisement

ఇంతలో స్వప్న అక్కడికి వస్తుంది. అప్పుడు నిరూపమ్ ఫ్యామిలీ అందరి ముందుకు కేక్ కట్ చేస్తే బాగుంటుంది కదా మమ్మీ అని అనగా స్వప్న, నిరూపమ్ పై సీరియస్ అవుతుంది. కానీ అందులో మీ అమ్మమ్మ, డాడీ లేకపోతే ఇంకా బాగుంటుంది అని అంటుంది. ఇంతలోనే అక్కడికి సత్య,జ్వాలా వస్తారు. వారిద్దరిని చూసి స్వప్న కోపంతో రగిలి పోతూ ఉంటుంది.

Advertisement

అప్పుడు జ్వాలా ని స్వప్న తక్కువస్థాయి అంటూ చులకనగా మాట్లాడుతున్నారు. అప్పుడు జ్వాల ఏ మాత్రం తగ్గకుండా కూలి పనులు చేసుకునే వాళ్లే మ్యారేజ్ డే జరుపుకుంటున్నారు. అలాంటిది కొందరు అన్నీ ఉన్నా కూడా ఏమీ చేయలేరు అంటూ స్వప్నాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది.

Advertisement

ఆ తరువాత జ్వాలా సత్యను బస్తీ కి తీసుకుని వెళ్లి అక్కడ మ్యారేజ్ డే జరుపుతాను అని అనడంతో, అప్పుడు స్వప్న జ్వాలా మీద కోపంతో సత్య తో కలిసి మ్యారేజ్ డే ఫంక్షన్ జరుపుకోవడానికి ఒప్పుకుంటుంది. అప్పుడు నిరూపమ్,జ్వాలా చేయి పట్టుకొని థాంక్స్ చెబుతాడు.

Advertisement

మరొకవైపు హిమ తాను నష్ట జాతకురాలు అని బాధపడుతూ ఉంటుంది. వాళ్ళ అత్త స్వప్న అన్న మాటల గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇంతలో నిరూపమ్ అక్కడికి రావడంతో గుడ్ న్యూస్ అంటూ మమ్మీ యానివర్స్ డే ఫంక్షన్ కి ఒప్పుకుంది దీనికి కారణం జ్వాలా నే అంటూ ఆనందంగా చెబుతుంది.

Advertisement

ఆ తరువాత నిరూపమ్, జ్వాలను మ్యారేజ్ డే కి రమ్మని చెప్పాను అని అనడంతో హిమ,సౌర్య కి ఎక్కడ నిజం తెలిసిపోతుందో అని భయపడుతూ ఉంటుంది. ఇక రేపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.

Advertisement
Advertisement