Thaman: టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరైన ఎస్.ఎస్.తమన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు మ్యూజిక్ స్టార్ డైరెక్టర్ గా పేరు పొందాడు. ఇటీవల తమన్ మ్యూజిక్ అందించిన భీమ్లా నాయక్ , సర్కారు వారి పాట వంటి సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. చేతి నిండా సినిమాలతో నిత్యం బిజీగా ఉండే తమన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన కుటుంబం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలియచేశాడు.
తమన్ ప్లే బ్యాక్ సింగర్ వర్ధినిను వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు. తమన్ భార్య వర్థిని గతంలో స్టార్ట్ మ్యూజిక్ డైరెక్టర్లు అయిన మణిశర్మ, యువన్ శంకర్ రాజా వంటి వారితో పని చేసింది. అంతే కాకుండ తమన్ మ్యూజిక్ అందించిన సినిమాలలో నాలుగు పాటలు కూడా పాడింది. ఈ సందర్బంగా తమన్ తన కోరికను కూడ బయటపెట్టాడు. తన భార్యతో కలిసి స్టేజ్ షోలు చేయాలని ఉందని తమన్ చెప్పుకొచ్చారు. ఇక తమన్ కుమారుడు విషయానికి వస్తె తను చేసిన ట్యూన్ లను తన కొడుకే మొదట వింటాడని చెప్పుకొచ్చాడు.
తన కుమారుడు పియానోలో నాలుగో గ్రేడ్ కూడా పూర్తి చేశాడని, ఎలక్ట్రికల్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ వాయించటంలో మంచి పట్టు ఉందని తన కొడుకు గురించి తమన్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తమన్ సర్కారు వారి పాట సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్, రామ్ చరణ్ నటిస్తున్న RC 15 సినిమాలకు సంగీతాన్ని అందిస్తూ బిజీగా ఉన్నాడు.
Tufan9 Telugu News And Updates Breaking News All over World