Karthika Deepam May 30 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో సౌందర్య,ఆనందరావు లు హిమ పెళ్లి విషయం మాట్లాడుతూ ఉండగా ఇంతలో అక్కడికి హిమ వస్తుంది. ఈరోజు ఎపిసోడ్ లో హిమ కు సౌందర్య,ఆనందరావు లు పెళ్లి విషయంలో చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తారు. ఈసారి ఏమీ మాట్లాడకుండా వారు తెచ్చిన సంబంధాన్ని కాదనకుండా పెళ్లి చేసుకోవాలి అని గట్టిగా బుద్ధి చెబుతారు. కానీ హిమ మాత్రం నీకు అసలు విషయాన్ని ఎలా చెప్పాలి నానమ్మ అని లోలోపల బాధపడుతూ ఉంటుంది.

Karthika Deepam May 30 Today Episode
అప్పుడు సౌందర్య చిన్నప్పటి నుంచి బావా బావా అని తిరిగి బావని పెళ్లి చేసుకుంటానని చెప్పి చివరికి మాటతప్పింది అంటూ హిమ పై కోప్పడుతుంది. మరొకవైపు ఇంద్రమ్మ దంపతులు కావాలనే స్వప్న కారు డోర్ రాకుండా లాక్ చేసి వెళ్లగా అప్పుడే స్వప్న వచ్చి కారు డోర్ రాకపోవడంతో హెల్ప్ కోసం ఎదురు చూస్తూ ఉండగా ఇంతలోనే ఇంద్రమ్మ దంపతులు అటుగా వచ్చి స్వప్న కార్ డోర్ ని ఓపెన్ చేస్తారు.
మరొకవైపు సత్య ఇంటికి నిరుపమ్ రావడంతో సత్య జ్వాల కి ఫోన్ చేసి భోజనం కాస్త ఎక్కువగా తీసుకొని రా అని చెబుతాడు. మరొకవైపు సౌందర్య, జ్వాలా కోసం నడిరోడ్డుపై ఎదురుచూస్తూ ఉంటుంది. అప్పుడు సౌందర్య మాట్లాడుతూ నాకు కావాలి అన్నప్పుడు నువ్వు కనిపించవు కానీ కొన్నిసార్లు మాత్రం నా వెనకాలే తిరుగుతున్నాను ఫాలో చేస్తున్నావు అనిపిస్తుంది అని అంటుంది.
నీతో నేను కొంచెం మాట్లాడాలి అని అనడంతో నాకు పని ఉంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్లి పోతుంది. మరొకవైపు సత్య,నిరుపమ్, ప్రేమ్ లు మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో జ్వాలా అక్కడికి వచ్చి ఏంటి ఎక్స్ట్రా అలా ఉన్నావు అని అనడంతో. అప్పుడు ప్రేమ్ జ్వాలా పై విరుచుకు పడతాడు. ఇకపై నువ్వు నన్ను అలా పిలవద్దు నీకు నాకు ఎటువంటి పరిచయం లేదు.
వచ్చామా భోజనం తెచ్చామా డబ్బులు తీసుకున్నావా వెళ్ళిపోయావా అన్న విధంగా ఉండు అంతే అంటూ వాళ్ళ పై విరుచుకు పడతాడు. ప్రేమ్ మాటలకు జ్వాలా ఎమోషనల్ అయి అక్కడి నుంచి వెళ్లి పోతుంది. అప్పుడు నిరుపమ్, ప్రేమ తరఫున జ్వాలకు స్వారీ చెబుతాడు. ఆ తర్వాత నిరుపమ్ హాస్పిటల్ కి వెళ్లి హిమ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు.
రేపటి ఎపిసోడ్ లో హిమని నిలదీస్తూ నువ్వు ఎవరితోతో పెళ్ళికి సిద్ధపడ్డావంట కదా నేను ఆ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనివ్వమని నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను అని మాట్లాడుతూ ఉండడంతో ఇంతలో అక్కడికి జ్వాలా వచ్చి వారి మాటలను వింటుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.