Singer Chinmayi : Singer Chinmayi Shocking Comments on NRI Marriages
Singer Chinmayi : సింగర్ చిన్మయి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కరలేదనుకుంట.. ఈ మధ్యే ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలో ఈ అమ్మడు తన భర్తతో కలిసి తొలిసారిగా వెండితెరపై కనిపించింది. సాధారణంగా చిన్మయి పాటలు పాడటమే కాదు చాలా బాగా డబ్బింగ్ కూడా చెబుతుంది. టాలీవుడ్ క్యూట్ బ్యూటీ సమంత నటించిన అన్ని సినిమాలకు చిన్మయే వాయిస్ ఓవర్ ఇచ్చింది. చిన్మయి వాయిస్ లేకపోతే సమంత తెలుగు ప్రేక్షకులకు అంతగా దగ్గరయ్యేది కాదేమో అన్న రేంజ్‌లో ఆమె స్వీట్ వాయిస్ ఉంటుంది. ఇకపోతే చిన్మయి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది.
ముఖ్యంగా చిన్మయి ఆడవాళ్లకు అన్యాయం జరిగిందంటే చాలు తన వాయిస్ రైజ్ చేస్తుంది. సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తుంది. మగవాళ్ల తప్పులను ఎత్తి చూపిస్తుంది. మొన్నిమధ్య సామ్ -చై విడాకులు తీసుకున్న సమయంలోనూ సమంతకు అండగా నిలిచిన చిన్మయి.. మగవాళ్లు చేసిన తప్పులను ఇంకెన్నాళ్లు భరించాలంటూ కామెంట్స్ చేసింది. అందుకే చాలా మంది బాధిత మహిళలు, అమ్మాయిలు సింగర్ చిన్మయిని ఫాలో అవుతుంటారు. అయితే, ఈ ముద్దుగుమ్మ పెట్టే పోస్టులు ఒక్కోసారి కాంట్రవర్సీకి గురవుతుంటాయి. ఫలితంగా చిన్మయి వారి నుంచి దూషణలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.
సాధారణంగా పేరెంట్స్ తమ కూతురు జీవితం బాగుండాలని ఎన్నారై సంబంధాలు చూసి ఎక్కువ కట్నం ఇచ్చి పెళ్లిళ్లు చేస్తుంటారు. అయితే, అక్కడ తమ బిడ్డలు ఎంత కష్టపడుతున్నారనేది పేరెంట్స్ గుర్తించరు. ఓ అమ్మాయి తన జీవితంలో ఎదుర్కొన్న విషయాన్ని నేను సోషల్ మీడియా ద్వారా నేను పోస్టు చేశాను. ఫారిన్ సంబంధం మోహలు నాకు ఎప్పటికీ అర్థం కావు. అమ్మాయిలను గౌరవంగా బతకనివ్వరు.. ఆర్థికంగా స్వేచ్ఛ ఇవ్వరు. కూతుళ్లు తమ కాళ్లపై నిలబడాలనుకుంటే పేరెంట్స్ అడ్డుపడుతారు. ఫలితంగా వారు ఎన్నారై భర్తల చేతిలో నరకయాతన అనుభవించాలి అంటూ చిన్మయి పెట్టిన పోస్టులపై కొందరు ఎన్నారైలు స్పందించారు. ‘ల**జ’ అంటూ తనను కామెంట్స్ చేశారని సోషల్ మీడియా వేదికగా చిన్మయి చెప్పుకొచ్చింది.
చిన్మయి.. తన ఇన్స్టాలో ‘డ్రంకెన్ డ్రైవింగ్..’ ఓవర్ స్పీడింగ్ అవగాహన కార్యక్రమాన్ని ఉదాహరణగా వివరించింది. అందులో ఇది చేయకూడదు.. ఇలానే చేయాలి చెబుతారని, అందరూ మద్యం సేవించి బండి నడుపుతున్నారని కాదు కదా.. అలా చేసేవారికి మాత్రమే చెబుతున్నట్టు లెక్క. నా ఇన్ స్టాలో పెడుతన్న స్టోరీస్ చూసిన ఎన్ఆర్ఐలు అందరూ అలా కాదు.. జనరలైజ్ చేయకే… అని బూతులు వాగనక్కర్లేదు. ఎవరైనా అమ్మాయి తన జీవితంలో ఎదుర్కొంటున్న కష్టాలను చెబుతున్నాను అంతే.. అలాగైనా మరో అమ్మాయి జాగ్రత్త పడుతుందని నా ఉద్దేశం మాత్రమే.
పెళ్లిళ్లు ఓ వ్యాపారం.. అమ్మాయి శరీరం అంటూ..
ఈ ఫారెన్ సంబంధాల మోహం ఎప్పటికీ అర్థం కాదని చిన్మయి చెప్పుకొచ్చింది. తల్లిదండ్రులు తమ బిడ్డకు గౌరవంగా బతికే అవకాశం అస్సలు ఇవ్వరని తెలిపింది. తన కాళ్ల మీద తను నిలబడే స్వేచ్చను అమ్మాయికి తల్లిదండ్రుల ఎందుకు ఇవ్వరోనని ఆలోచిస్తుంటాను. భారీగా కట్నాలు ఇచ్చి పెళ్లి చేస్తుంటారు.. అమ్మాయిలకు మాత్రం ఆర్థికంగా, స్వేచ్ఛగా స్వతంత్రంగా బతకనివ్వరని చెప్పింది.
సోషల్ మీడియా వేదికగా చిన్మయి.. పెళ్లిళ్లు అనేవి ఒక వ్యాపారంగా మారాయిని, అమ్మాయి శరీరం అంటూ షాకింగ్ కామెంట్ చేశారు. కొంతమంది అమ్మాయిలకు అయినా అవగాహన వస్తే.. తమకు నచ్చిన అబ్బాయిని వేరే క్యాస్ట్ వారిని పెళ్లి చేసుకుంటారని భావించే తల్లిదండ్రులు.. తమ అమ్మాయిలను వారికి ఇష్టం లేకపోయినా తమ క్యాస్ట్ అబ్బాయి ఎంత వెధవ అయినా బలవంతంగా ఇచ్చి పెళ్లి చేస్తుంటారని షాకింగ్ కామెంట్స్ చేశారు. చిన్మయి పోస్టు వైరల్ కావడంతో ఆమె వ్యాఖ్యలు నచ్చనివారితో భారీగా ట్రోలింగ్ కు గురవుతోంది.
Business Idea : ఆన్‌లైన్ కంటెంట్ క్రియేషన్ నుంచి అగరుబత్తుల తయారీ వరకు ఈ వ్యాపారాలు తక్కువ డబ్బుతో ప్రారంభమై…
Muharram School Holiday 2025 : జూలై 7, 2025, మొహర్రం సందర్భంగా ప్రభుత్వ సెలవు దినం (is tomorrow…
ICAI CA May 2025 Exam Toppers : ICAI CA మే 2025 రిజల్ట్స్ విడుదల అయ్యాయి. CA…
PM Kisan 20th Installment Date : PM కిసాన్ 20వ వాయిదాకు సంబంధించి లబ్ధిదారుల జాబితాలో పేరు లేని…
PF Balance Check : ఇప్పుడు మీరు ఇంటర్నెట్ లేకుండా కూడా PF బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. మీరు SMS,…
Shortest Day : భూమి భ్రమణ వేగం పెరిగింది. రోజు 24 గంటలు కాదు.. చంద్రుడు, భూమి ఒక భాగంలో…
This website uses cookies.