Guppedantha Manasu May 25 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో రిషి, వసు కి పెన్ను ఇచ్చి ఆల్ ది బెస్ట్ అని చెప్తాడు. ఈ రోజు ఎపిసోడ్ లో వసు ఎగ్జామ్ రాయడానికి వెళ్తుండగా అప్పుడు రిషి నీకు జీవితంలో మరిచిపోలేని ఊహించని గిఫ్ట్ ఈరోజు నేను నీకు ఇస్తాను అని మనసులో అనుకుంటూ ఉంటాడు. వసు ఎగ్జామ్ కి వెళ్తుండగా రిషి చేతులు గట్టిగా పట్టుకొని చాలా థాంక్స్ అని చెబుతోంది.

Guppedantha Manasu May 25 Today Episode
ఎగ్జామ్ హాల్ దగ్గర వసు కోసం వెయిట్ చేస్తున్న సాక్షి నువ్వు ఎగ్జామ్ ఎలా రాస్తావో నేను కూడా చూస్తాను అంటూ నవ్వుకుంటూ ఉంటుంది. మరొకవైపు రిషి వాళ్ల పెద్దమ్మ ఏదో మెసేజ్ పెట్టింది అని మొబైల్ ఓపెన్ చేసి చూడగా అందులో రిషి వెడ్స్ సాక్షి అని వెడ్డింగ్ కార్డు ఉండటం చూసి ఒక్క సారిగా షాక్ అవుతాడు. వెంటనే దేవయానికి ఫోన్ చేసి వెడ్డింగ్ కార్డు ఎవరు చేయించారు పెద్దమ్మ అని అడుగగా మీ డాడీ అని చెప్పి మహేంద్రకు ఫోన్ మాట్లాడమని ఇస్తుంది. అప్పుడు రిషి,మహేంద్ర పై ఒక రేంజ్ లో విరుచుకు పడతాడు.. మరొకవైపు ఎగ్జామ్ హాల్ లో వసు రిషి ఇచ్చిన పెన్ను వైపు చూసుకుంటూ మురిసిపోతూ ఉంటుంది.
Guppedantha Manasu : వసుధారనే తన లైఫ్ పాట్నర్ అనుకుంటున్న రిషి.. సాక్షి ఏం చేయనుంది..?
అంతేకాకుండా రిషి ఎగ్జామ్ హాల్ లోకి వచ్చి ఆల్ ది బెస్ట్ చెప్పినట్టుగా ఊహించుకుంటూ ఉంటుంది. మరొకవైపు మహేంద్ర, జగతి, ధరణి, రిషి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు మహేంద్ర రిషి మనసులో తప్పకుండా వసు ఉంది అని నేను నమ్ముతాను అని అంటాడు. కానీ జగతి మాత్రం ఏమవుతుందో అని టెన్షన్ పడుతూ ఉంటుంది. మరొక వైపు రిషి ఒంటరిగా నిలబడి వెడ్డింగ్ కార్డులో సాక్షి పక్కన నా ఫొటో ఉండడం ఏంటి అని కోప్పడుతూ ఉంటాడు. అప్పుడు వసుధార తో తను గడిపిన క్షణాలు తీపి జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటాడు.
అప్పుడు వసు లేకపోతే, దూరంగా వెళ్లిపోతే తాను ఉండలేను అని గ్రహించి ఇదేనా ప్రేమంటే అని అనుకుంటాడు. అప్పుడు నాకు అర్థమయ్యింది వసుదారే నా లైఫ్ పార్ట్నర్.. బస్సు నా పక్కన ఉంటే ప్రతి రోజు ఆనందాల పండుగే అని గట్టిగా మనసులో అనుకుంటాడు. మిస్టర్ రిషేంద్ర చంద్రభూషణ్ నీకు వసు కావాలి అని గట్టిగా అరిచి చెబుతాడు. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.
Read Also : Guppedantha Manasu MAY 24 Today Episode : రిషి ఒడిలో వసు..మాస్టర్ ప్లాన్ వేసిన సాక్షి..?