Ram Charan NTR : Ram Charan Interesting Comments on Jr NTR in RRR Pre Release Event
Ram Charan NTR : దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో వస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీపై ఇప్పటికే భారీ అంచాలు నెలకొన్నాయి. ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ యాక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రస్తుతం చెన్నైలో జరుపుతున్నారు. తమిళ ఆడియన్స్ కోసం ఈ ఈవెంటు ఏర్పాటు చేసింది మూవీ యూనిట్. ఇందులో రామ్ చరణ్ మాట్లాడుతూ ఎన్టీఆర్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తుకు తెచ్చుకున్నాడు. సోమవారం నిర్వహించిన ఈ ఈవెంట్ కు ఉదయ నిధి స్టాలిన్, శివ కార్తికేయన్, తదితరులు ముఖ్య అతిథులుగా హజరయ్యారు.
ఇందులో రామ్ చరణ్ మాట్లాడుతూ ఇక్కడికి వచ్చిన ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు సోదరులకు థాంక్స్ అంటూ చెప్పాడు. లైకా ప్రొడక్షన్ సుభాస్కరణ్‌తో ఎప్పటినుంచో వర్క్ చేయాలని అనుకుంటున్నా.. కానీ ఆర్ఆర్ఆర్ తో అది కుదిరిందని చెప్పుకొచ్చాడు చరణ్. తను మొదటి హిట్ ఇచ్చిన డైరెక్టర్ రాజమౌళికి సైతం ఆయన థాంక్స్ చెప్పారు. ఇక తనకు ఎన్టీఆర్ లాంటి బ్రదర్ ను ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పాడు. నాకు, తారక్‌కు ఒక ఏడాది మాత్రమే గ్యాప్ అని గుర్తుచేశాడు.
ఇలాంటి బ్రదర్ ఇచ్చినందుకు.. దేవుడికి థ్యాంక్స్ చెబుతున్నానని అన్నాడు. ఒక వేళ ఎన్టీఆర్‌కు కృతజ్ఞతలు చేప్తే మా బంధం ఇక్కడే ఆగిపోతుందేమో అని అనిపిస్తుంది. ఆర్ఆర్ఆర్ మూవీతో మా మధ్య ఏర్పడ్డ అనుబంధాన్ని నేను చేనిపోయేంత వరకు మనసులోనే దాచుకుంటానని చెప్పుకొచ్చాడు చరణ్. ఇక ఆర్ఆర్ఆర్ మూవీ జనవరి లో రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది మూవీ యూనిట్.
ఇద్దరు టాప్ స్టార్స్ ఈ మూవీలో యాక్ట్ చేయడంతో ఈ మూవీపై అంచనాలు భారీ స్థాయిలోనే ఉన్నాయి. ఈ మూవీ కోసం రాంచరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఈ మూవీ ట్రైలర్ ఎన్నో రికార్డులను సృష్టించింది. మరి మూవీ రిలీజ్ అయితే మరెన్ని రికార్డులను సృష్టిస్తుందోనని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
Read Also : Pushpa Sukumar : పుష్పలో ఆ సన్నివేషాన్ని సుకుమార్ నగ్నంగా తీయాలనుకున్నాడట..!
Top 10 Foods Diabetics : చక్కెర, జంక్, గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) ఆహారాలకు దూరంగా ఉండాలి. డయాబెటిక్ ఉన్నవారు…
Varahi Navaratri 2025 : ఈ వారాహి గుప్తనవరాత్రుల్లో పూజలను ఎవరు చేయాలి? అందరూ చేయొచ్చా? ఎవరూ చేయకూడదు? వారాహి…
Ashada Amavasya 2025 : జూలై 25 ఆషాఢ మాసంలో అమావాస్య రోజు. ఈ రోజున పూర్వీకుల ఆత్మలు భూమికి…
Ashadha Amavasya : ఈ రోజు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. పితృ పూజకు ప్రసిద్ధి చెందింది. ఈ రోజున…
WI vs AUS Test : జూన్ 25న బార్బడోస్‌లో ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో వెస్టిండీస్ ఆస్ట్రేలియాకు…
TG EDCET Result 2025 : టీఎస్ EDCET రిజల్ట్స్ 2025 విడుదల అయ్యాయి. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక…
This website uses cookies.