Pushpa-Movie-Review-Allu-Arjun
Pushpa Movie Review : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లీడ్ రోల్‌లో దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన చిత్రం ‘పుష్ప’ డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. భారీ తారాగణంతో పాటు భారీ బడ్జెట్ ఆకట్టుకునే కథనంతో ప్రేక్షుకుల ముందుకు వచ్చింది ‘పుష్ఫ’ మూవీ.. గతంలో సుక్కు డైరెక్షన్‌లో బన్నీ నటించిన ఆర్య, ఆర్య-2 సినిమాలు విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక పుష్ప సినిమాతో సుక్కు బన్నీకి హ్యాట్రిక్ ఇచ్చాడో లేదో ఇప్పుడు తెలుసుకుందాం..
పుష్ప కథనం :
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో తొలిసారి పాన్ ఇండియా రేంజ్ మూవీ తెరకెక్కించాడు దర్శకుడు సుకుమార్.. ఆయన కెరీర్‌లో ఇదే భారీ బడ్జెట్ మూవీ.. ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కింది. కథ విషయానికొస్తే.. ఏపీలోని రాయలసీమ ప్రాంతంలో గల శేషాచలం అడవుల్లో ఎర్ర చందనం చెట్లను నరికే కూలీల సీన్‌తో సినిమా మొదలవుతుంది. అల్లు అర్జున్ ఎర్రచందనం దుంగలను లారీలో స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు చిక్కుతాడు.
నీ పేరేంటని అడుగగా పుష్ప.. పుష్పరాజ్ అని డైలాగ్ చెప్పడంతో టైటిల్ పడుతుంది. పుష్ప రాజ్ అతి తక్కువ టైంలో స్మగ్లింగ్ సామ్రాజ్యానికి ఎలా లీడర్ అవుతాడు. తనకు అడ్డు వచ్చిన వారిని ఎలా ఎదుర్కొంటాడు. రష్మీక మందన్నా ఈ మూవీలో శ్రీవర్లి రోల్ చేస్తుంది. పుష్పరాజ్‌కు ప్రియురాలి పాత్రలో కనిపించింది. పుష్పరాజ్‌ను అడ్డం పెట్టుకుని ఎవరెవరు ఎలా ఎదుగుతారు.. పుష్పరాజ్ తన ఒరిజినల్ పేరు ఎలా కోల్పోతాడు. బాగా చూపించారు. చివర్లో భారీ ట్విస్ట్ పెట్టారు.
సినిమా అనాలసిస్..
వేల కోట్ల విలువ చేసే ఎర్రచందనాన్ని ఎలా స్మగ్లింగ్ జరుగుతుందనే విషయాన్ని సుకుమార్ చాలా రియాలిటీగా చూపించారు. భారీ తారాగణం.. మంచి హై వాల్యూస్ టెక్నికల్ టీంతో పనిచేశారు. హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాతో పాటు ఇందులో తల్లి సెంటిమెంట్.. మరియు ప్రియురాలి సెంటిమెంట్ చాలా బాగుంటుంది. అల్లు అర్జున్ ఈ మూవీకోసం ప్రాణం పెట్టాడనే చెప్పుకోవాలి. నిర్మాతలు కూడా ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాకు తెరకెక్కించినందుకు మంచి ఫలితం దక్కింది.
ప్లస్ (+) ఎంటంటే..
సుకుమార్ తాను… సుకుమార్ రాసుకున్న కథ కోసం నటీనటులను సరిగ్గా ఎంచుకున్నారు. పుష్పరాజ్‌గా బన్నీ అదుర్స్ అనిపించాడు., రష్మిక పల్లెటూరి యాస కట్టు, బొట్టులో సూపర్ అనిపించింది. ఇక ఎర్రచందనం స్మగ్లర్స్ నాయకుడిగా సునీల్ అదరగొట్టాడు. కమెడియన్ అనే తన పేరు ఈ సినిమాతో చెరిగిపోయింది. సమంత ఐటెం సాంగ్ లో కనిపించి ఆడియెన్స్‌కు అదిరిపోయే అందాల విందును వడ్డించింది. మళయాల నటుడు ఫాహద్ ఫాజిల్ ఫస్ట్ పార్టులో కొద్దిగా నిరాశ పరుస్తాడు. ప్రకాష్ రాజ్, జగపతిబాబు, రావు రమేష్ , అజయ్ ఘోష్ కూడా పరవాలేదని పించారు.
మైనస్ (-) ఏంటంటే..
ఎర్ర చందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్‌లో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. చివర్లో కథ కొంచెం నెమ్మదిగా సాగుతుంది. కొన్ని సన్నివేశాలు ఓవర్ అనిపించాయి. పెద్దగా ట్విస్టులు కనిపించలేదు.
మూవీ : పుష్ప ది రైజ్.. (Pushpa The Rise)
యాక్టర్స్ : అల్లు అర్జున్, రష్మిక మందన్నా, ఫాహద్ ఫాసిల్, సునీల్, ప్రకాష్ రాజ్ , జగపతి బాబు, అనసూయ, అజయ్ ఘోష్, శత్రు.
మ్యూజిక్ : దేవి శ్రీ ప్రసాద్
ప్రొడ్యూసర్స్ : నవీన్ యేర్నేని, వై. రవి శంకర్
డైరెక్టర్ : సుకుమార్
Movie Rating :
– మేము ఇచ్చే మూవీ రేటింగ్ 3/5..
Read Also : Pushpa Review : ‘పుష్ప’ బెనిఫిట్ షో రివ్యూ.. ఫ్యాన్స్ టాక్..!
Read Also : Pushpa Review : Pushpa 2 Title Leak : పుష్ప పార్ట్-2 టైటిల్ లీక్.. సోషల్ మీడియాలో వైరల్!
Top 10 Foods Diabetics : చక్కెర, జంక్, గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) ఆహారాలకు దూరంగా ఉండాలి. డయాబెటిక్ ఉన్నవారు…
Varahi Navaratri 2025 : ఈ వారాహి గుప్తనవరాత్రుల్లో పూజలను ఎవరు చేయాలి? అందరూ చేయొచ్చా? ఎవరూ చేయకూడదు? వారాహి…
Ashada Amavasya 2025 : జూలై 25 ఆషాఢ మాసంలో అమావాస్య రోజు. ఈ రోజున పూర్వీకుల ఆత్మలు భూమికి…
Ashadha Amavasya : ఈ రోజు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. పితృ పూజకు ప్రసిద్ధి చెందింది. ఈ రోజున…
WI vs AUS Test : జూన్ 25న బార్బడోస్‌లో ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో వెస్టిండీస్ ఆస్ట్రేలియాకు…
TG EDCET Result 2025 : టీఎస్ EDCET రిజల్ట్స్ 2025 విడుదల అయ్యాయి. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక…
This website uses cookies.