HomeEntertainmentO Saathiya Title Song : ఆకట్టుకుంటోన్న 'ఓ సాథియా' టైటిల్ సాంగ్..!

O Saathiya Title Song : ఆకట్టుకుంటోన్న ‘ఓ సాథియా’ టైటిల్ సాంగ్..!

O Saathiya Title Song : ప్రస్తుతం ఉన్న సినిమాలకు సంగీతం ఎంతగా ప్లస్ అవుతుందో అందరికీ తెలిసిందే. పాటలు బాగుంటే, సంగీతానికి మంచి ఆదరణ లభిస్తే సినిమాలు హిట్ అవుతాయని అంతా నమ్ముతుంటారు. ఇక ప్రేమ పాటలు, మెలోడీ పాటలు జనాలకు ఎప్పుడూ ఇట్టే నచ్చేస్తుంటాయి. అలాంటి చక్కటి మెలోడి గీతాలతో, మంచి ప్రేమ కథతో ఓ సాథియా అనే చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమవుతోంది. ఈ సినిమాకు దర్శకనిర్మాతలిద్దరూ మహిళలే కావడం విశేషం.

Advertisement

తన్విక జశ్విక క్రియేషన్స్ బ్యానర్ మీద చందన కట్టా ఓ సాథియా అనే చిత్రాన్ని నిర్మిస్తుండగా.. దివ్యా భావన దర్శకత్వం వహిస్తున్నారు. ఓ సాథియా సినిమాలో ఆర్యన్ గౌర, మిష్టి చక్రవర్తి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆర్యన్ గౌర.. అంతకు ముందు జీ జాంబీ అనే చిత్రం చేశారు. ఇప్పుడు ఆయన హీరోగా రెండో సినిమాగా ఓ సాథియా రాబోతోంది. రాజ్య సభ సభ్యుడు, లెజెండరీ రైటర్ విజయేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌కు ఆడియెన్స్‌ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

Advertisement
o sathiya telugu title song Released
o sathiya telugu title song Released

మెలోడీ బ్రహ్మ మణిశర్మ చేతుల మీదగా రీసెంట్‌గా విడుదల చేసిన ఓ సాథియా టైటిల్ సాంగ్‌కు సోషల్ మీడియాలో విశేషమైన స్పందన లభిస్తోంది. వన్ మిలియన్ వ్యూస్‌కు చేరువలో ఉన్న పాటలో.. భాస్కర భట్ల సాహిత్యం, విన్ను అందించిన బాణీ, జావెద్ అలీ గాత్రం అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ లిరికల్ వీడియోలోని విజువల్స్ చూస్తే సినిమాను ఎంత రిచ్‌గా తీశారో అర్థమవుతుంది. ఈజే వేణు సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్ అవుతుందని తెలుస్తోంది. ప్యూర్ లవ్ స్టోరీగా రాబోతోన్న ఈ సినిమా మీద ప్రస్తుతం మంచి బజ్ క్రియేట్ అయింది. త్వరలోనే సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు.

Advertisement

సాంకేతిక బృందం :

దర్శకత్వం : దివ్య భావన
నిర్మాత : చందన కట్టా
బ్యానర్ : తన్విక జశ్విక క్రియేషన్స్
సంగీత దర్శకుడు : విన్ను
పాటల రచయితలు : భాస్కర భట్ల, అనంత శ్రీరామ్, రాంబాబు గోసాల
కొరియోగ్రఫర్స్ : రఘు మాస్టర్, బాబా భాస్కర్, ఆనీ మాస్టర్
ఎడిటర్ : కార్తిక్ కట్స్
కెమెరామెన్ : ఈజే వేణు
పీఆర్వో : సాయి సతీష్‌

Advertisement

Read Also : Karthika Deepam Final Episode : మోనితని చంపేసిన వంటలక్క.. ప్రమాదం నుంచి బయటపడిన దీప, కార్తిక్?

Advertisement
Advertisement
Tufan9 Telugu News
Tufan9 Telugu Newshttps://tufan9.com
Tufan9 Telugu News providing All Categories of Content from all over world
RELATED ARTICLES

Most Popular

Recent Comments