Karthika Deepam: తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. గత ఎపిసోడ్ లో జ్వాలా, నిరూపమ్ ఒకరినొకరు చూసుకుంటూ సిగ్గు పడుతూ ఉంటారు.
ఈరోజు ఎపిసోడ్ లో హిమ, స్వప్న కి హెల్త్ చెక్ చేస్తూ ఉండగా అప్పుడు స్వప్న చిరాకు పడుతూ ఉంటుంది. అప్పుడు స్వప్న ఇంజక్షన్ కూడా చేయడానికి భయపడతావు ఒక డాక్టర్ వేనా అంటూ అవమానిస్తుంది. మీరందరూ నన్ను ఉద్దరించాల్సిన అవసరం లేదు ఇక్కడినుంచి వెళ్లిపోండి అని సౌందర్య,హిమ పై అరుస్తుంది.
మరొకవైపు జ్వాలా,నిరూపమ్ రెస్టారెంట్ లో మనసులో మాటను బయటకు చెప్పుకోవడానికి ఇద్దరూ టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడు జ్వాల నిరూపమ్ నోటి నుంచి ఐలవ్యూ అనే మాట కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నిరూపమ్ చెప్పబోతూ ఉండగా ఇంతలో జ్వాలా నేను నీకు ఒక విషయం చెప్పాలి డాక్టర్ సాబ్ అని అంటుంది.
అప్పుడు జ్వాలా ఐ లవ్ యు చెప్ప బోతుండగా ఇందులో ప్రేమ్ వచ్చి జ్వాలా ప్లాన్ ను చెడగొడతాడు. అప్పుడు జ్వాలా, ప్రేమ్ ని తిట్టుకుంటూ ఉంటుంది. ఇంతలో నిరూపమ్ కి ఫోన్ కాల్స్ రావడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
మరొకవైపు హిమ,సౌందర్య లు స్వప్నకు సపర్యలు చేస్తూ ఉండగా అప్పుడు స్వప్న మీరు ప్రేమను ఒలకు బోయాల్సిన అవసరం లేదు నాకు నా కొడుకు ఉన్నాడు అని అనడంతో ఇంతలో అక్కడికి వచ్చిన నిరూపమ్, స్వప్న కి ఆరోగ్యంగా ఉండమని జాగ్రత్తలు చెబుతాడు.
మరొకవైపు సత్య కోసం జ్వాలా బిర్యానీ తీసుకొని వస్తుంది. అంతలో అక్కడికి ప్రేమ్, జ్వాలా తో ఫన్నిగా పొట్లాడుకుంటాడు. అప్పుడు ప్రేమ్,నిరూపమ్, హిమ కి ఫోన్ వాళ్ళ ఇంటికి రమ్మని చెబుతాడు. రేపటి ఎపిసోడ్ లో జ్వాలా,నిరూపమ్ పెళ్లి చేసుకుంటారు. ఇక రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.
Tufan9 Telugu News And Updates Breaking News All over World