...

Karthika Deepam:స్వప్న,సత్య లను కలిపిన జ్వాలా..ఆనందంలో నిరూపమ్..?

Karthika Deepam: తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో జ్వాలా, ప్రేమ్ లు ఫన్నీ గా పొట్లాడుకుంటూ ఉంటారు..

ఈరోజు ఎపిసోడ్ లో ప్రేమ్, జ్వాలా తెచ్చిన బిర్యానీ తినడం కోసం హిమ, నిరూపమ్ కి కాల్ చేసి పిలుస్తాడు. అప్పుడు ప్రేమ్ అమ్మనాన్నలు కలిస్తే హిమని పెళ్లి చేసుకోవడం చాలా ఈజీ అని మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇంతలో నిరూపమ్, హిమ అక్కడికి రావడంతో అందరూ కలిసి బిర్యాని తింటుండగా జ్వాలా వారికి వడ్డిస్తుంది.

అప్పుడు నిరూపమ్ మనం ఇలా అందరూ కలిసి తిన్నట్టే మమ్మీ డాడీ లు కూడా కలిసి తింటే బాగుంటుంది అని ప్రేమ్ తో అంటాడు. ఇంతలో అక్కడికి వచ్చిన సత్య జ్వాలా ని పొగుడుతాడు. ఆ తర్వాత మీరు అందరూ తినండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు సత్య.

ఈ క్రమంలోనే జ్వాలా, తనకు నిరూపమ్ పెళ్లి అయినట్లు ఊహించుకుంటూ ఉంది. ఇంతలో నిరూపమ్ అమ్మానాన్నల మ్యారేజ్ యానివర్సరీ కి వారిద్దరినీ కలిపితే మనం భవిష్యత్తులో ఆనందంగా ఉంటాము అని అనగా ప్రేమ్,హిమ లు కూడా అదే విషయం గురించి ఆలోచిస్తూ ఉంటారు.

అప్పుడు ప్రేమ్ ఫంక్షన్ ని అడ్డుపెట్టుకొని ఎలాగైనా హిమ కు ప్రపోజ్ చేయాలి అని అనుకుంటాడు. ఆ తరువాత జ్వాలా చెత్త పేపర్లు కొనడానికి వెళ్లగా అక్కడ జ్వాలా ఆటోలో ఒక దొంగవ్యక్తి డబ్బులు కొట్టేస్తాడు. అది చూసిన సౌందర్య దొంగ వాడిని పట్టుకుని జ్వాలకు అప్పగించగా జ్వాలా వాడిని లాగి చెంపమీద కొడుతుంది.

రేపటి ఎపిసోడ్ లో నిరూపమ్ వాళ్ళ అమ్మానాన్న మ్యారేజ్ యానివర్స్ డే గురించి స్వప్నతో చర్చిస్తూ ఉండగా ఇంతలో అక్కడికి సత్య ,జ్వాలా వస్తారు. అప్పుడు జ్వాలా మాట్లాడుతూ సార్ పెళ్లి రోజు నేను బస్తీ లో ఘనంగా జరుపుతాను అనగా, అప్పుడు స్వప్న ఛీ ఛీ ఆయనకి మీ బస్తీలో మ్యారేజ్ డే ఫంక్షన్ జరగడానికి వీల్లేదు నేను చెబుతున్నాను మా మ్యారేజ్ డే ఫంక్షన్ ను నా కొడుకు జరిపిస్తాడు అని అనడంతో నిరూపమ్ ఒక్కసారిగా సంతోష పడతాడు. ఆ తర్వాత నిరూపమ్, జ్వాలా కి థాంక్స్ చెప్పి ఆ రోజు నీకు నా మనసులోని మాట చెప్పాలి అని అంటాడు. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి మరి.