Pooja Hegde: టాలీవుడ్ టాప్ హీరోయిన్ అయిన పూజా హెగ్డే వరుస సినిమాలతో నిత్యం బిజీగా ఉంటోంది. ఇటీవల ఆమె నటించిన ఆచార్య, రాధే శ్యామ్ చిత్రాలు ప్రేక్షకులను కొంచెం నిరాశ పరిచాయి. అయినా ఈ అమ్మడు తెలుగు , తమిళ, హిందీ భాషలలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది. పూజా హెగ్డే కథానాయిక పాత్రలు మాత్రమే కాకుండా రంగస్థలం సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ కూడ చేసింది. ఈ సినిమాలో ” జిగేలు రాణి” పాటతో ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ప్రస్తుతం ఈ అమ్మడు వరుణ్ తేజ్, వెంకటేష్ నటిస్తున్న F3 సినిమాలో కూడా ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది.
F2 సినిమా కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న F3 సినిమాకి అనీల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. తాజాగా ఈ సినిమా నుండి మరొక పాటను సినిమా యూనిట్ విడుదల చేశారు. ఈ పాటలో పూజా హెగ్డే వెంకటేష్, వరుణ్ తేజ్ లతో కలిసి చేసిన సందడి అంతా ఇంతా కాదు. “అధ్యక్ష లైఫ్ అంటే మినిమమ్ ఇట్టా ఉండాలా” అంటూ సాగిపోయే ఈ పాట ద్వార జీవితాన్ని ఎలా అనువించాలో తెలియచేశారు.
కాసర్ల శ్యామ్ రచించిన పిట్టగోడపై పెట్టే సరదా ముచ్చట్లు చైనా వాల్ పై పెట్టుకుందాం. ” అయ్యగారి కొట్టులో కొట్టే ఛాయ్ పక్కనెట్టి ఈఫిల్ టవర్ పై ఐస్ టీ కొట్టెద్దాం ” అంటూ సాగిపోయే ఈ పాట ఇటీవల విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ పాటను గీతామాధురి, రాహుల్ సిప్లిగంజ్ పాడారు. అనీల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమకి మే 27 వ తేదీన ప్రేక్షకులని అలరించటానికి సిద్దంగా ఉంది.ప్రస్తుతం ఈ ఐటెం సాంగ్ కు సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Summer AC Tips : ఏదైనా ఏసీని కొనుగోలు చేసే ముందు ఈ సూచనలను పరిగణనలోకి తీసుకోవాలి. మీకోసం 4…
Poco C71 Launch : భారత మార్కెట్లో Poco C71 మోడల్ 4GB + 64GB బేస్ కాన్ఫిగరేషన్ ధర…
Realme 13 Pro Price : రియల్‌మి 13 ప్రో ఫోన్ 8GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర…
CSK vs RCB : ఐపీఎల్ 2025లో ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) చెన్నై సూపర్…
Airtel IPTV Plans : ఎయిర్‌టెల్ 2వేల నగరాల్లో IPTV (ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్) సర్వీసును ప్రవేశపెట్టింది. హై-స్పీడ్ ఇంటర్నెట్,…
Spinach : పాలకూర ఆరోగ్యకరమైన కూరగాయలలో వస్తుంది. ఇది అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందించే అన్ని ముఖ్యమైన పోషకాలతో నిండి…
This website uses cookies.