Jr NTR Reaction : యంగ్ టైగర్ ఎన్టీఆర్ పడిన కష్టానికి ఫలితం దక్కిందా? మూడేళ్లకు పైగా కష్టపడిన మూవీతో ఆయన సంతృప్తి చెందారా? దర్శకదీరుడు జక్కన్న తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీలో కొమురం భీం వంటి పవర్ ఫుల్ పాత్రలో నటించిన ఎన్టీఆర్ వందకు వంద మార్కులు పడ్డాయనే చెప్పాలి. ఎందుకంటే.. ఆర్ఆర్ఆర్ మూవీ అంచనాలకు మించి హైప్ సాధించింది. ఆర్ఆర్ఆర్ మూవీ బ్లాక్ బస్టర్ అనడంలో సందేహం అక్కర్లేదు.
ఆ విక్టరీ ఎన్టీఆర్ కళ్లలలో స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చూసి బయటకు వచ్చిన తర్వాత ఆయన రియాక్షన్ చూస్తే అర్థమవుతుంది. హైదరాబాద్‌లోని AMB సినిమాస్‌లో జూనియర్ ఎన్టీఆర్ కుటుంబం, సన్నిహితుల కోసం స్పెషల్ షో వేశారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్, ఆయన సతీమణి లక్ష్మీ ప్రణతి, పిల్లలు నందమూరి అభయ్ రామ్, నందమూరి భార్గవ్ రామ్ వెళ్లారు. ఆర్ఆర్ఆర్ ప్రివ్యూకి మెగాస్టార్ చిరంజీవి కూడా హాజరయ్యారు.
ఆర్ఆర్ఆర్ మూవీ చూశాక అసలు ఎన్టీఆర్ రియాక్షన్ ఎలా ఉంటుందా అని ఫ్యాన్స్ ఆసక్తి ఎదురుచూస్తున్న వేళ.. ఎన్టీఆర్ చిరునవ్వుతో బయటకు వస్తూ రెండు చేతులను పైకెత్తి విక్టరీ సింబల్ చూపించారు. మీడియా సినిమా ఎలా వచ్చింది సార్ అన్నట్టు ఎదురుపడగానే.. ఎన్టీఆర్ డబుల్ థంబ్స్ చూపించి ఫుల్ హ్యాపీ మూడ్‌లో ఉన్నట్టు కనిపించాడు. అందులోనూ ఆర్ఆర్ఆర్ రివ్యూలు కూడా చాలావరకూ పాజిటివ్ టాక్ వస్తున్నాయి. అంటే.. ఆర్ఆర్ఆర్ మూవీ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ క్రియేట్ చేయబోతుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఆర్ఆర్ఆర్ అనుకున్నదానికంటే వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు రాబడుతుందని అంచనాలు వేస్తున్నారు. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ మూవీ వసూళ్లపై జోరుగా బెట్టింగులు కూడా జరుగుతున్నాయి.
నిర్మాత డీవీవీ దానయ్య నిర్మాణంలో వచ్చిన RRR Movie తెలుగు, కన్నడ, హిందీ, తమిళం, మలయాళం భాషల్లో భారీ అంచనాలతో మార్చి 25న విడుదల అయింది. ఈ మూవీకి ఎంఎం కీరవాణి మ్యాజిక్ అందించగా.. ‘ఆర్ఆర్ఆర్’లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కీ రోల్స్ పోషించారు. బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, అజయ్ దేవగన్, ఒలీవియా మోరిస్, సముద్రఖని, రే స్టీవెన్‌సన్, అలిసన్ డూడీ ప్రధాన పాత్రల్లో నటించారు.
Read Also : RRR Review : ‘ఆర్‌ఆర్ఆర్’ రివ్యూ.. జక్కన్న చెక్కిన ట్రిపుల్‌ఆర్‌లో హైలైట్స్ ఇవే..!
IRCTC Down : ప్రముఖ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC)సైట్, యాప్ గురువారం (డిసెంబర్ 26)…
ICAI CA Final Result 2024 : ICAI CA ఫైనల్ రిజల్ట్స్ నవంబర్ 2024 లైవ్ అప్డేట్స్ :…
Earthquake AP : ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ భూమి కంపించింది. రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో స్వల్ప భూకంపం సంభవించింది. భూమి ఒక్కసారి…
Earthquake Nepal : మన పొరుగు దేశం నేపాల్‌లో తెల్లవారుజామున భూకంపం సంభవించింది. నేపాల్‌లో శనివారం ఉదయం 4.8 తీవ్రతతో…
Is Bank Open Today : ఈరోజు బ్యాంకులకు హాలిడే ఉందో లేదో తెలియదా? వారాంతాల్లో ఆర్థిక లావాదేవీలను పూర్తి…
Om Prakash Chautala : హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాష్ చౌతాలా ఇకలేరు. ఇండియన్ నేషనల్ లోక్ దళ్…
This website uses cookies.