Karthika Deepam March 10 Today Episode : బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. దీప,కార్తీక్ లు నైట్ పార్టీ లో జరిగిన విషయం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు కార్తీకదీపం థాంక్స్ చెబుతాడు. అప్పుడు దీప డాక్టర్ బాబు రాత్రి నేను చాలా మాట్లాడానా అని అడగగా అలా ఏమీ లేదు దీపా అని అంటాడు. అలా కొద్దిసేపు కార్తీక్, దీప లు ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు.
మరొకవైపు సౌందర్య గుడిలో పూజారి చెప్పిన మాటలు, భర్త ఆనందరావు చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంట్లో వాళ్ళు వేరే ఫంక్షన్ కి రమ్మని చెప్పినప్పుడు నన్ను ఒంటరిగా వదిలేయండి అని చెబుతుంది సౌందర్య. వారు వెళ్లిపోయిన తర్వాత తాను మాత్రమే దీప, కార్తీక్ ల గురించి ఎందుకు అంతలా ఆలోచిస్తున్నాను అని ప్రశ్న వేసుకుంటుంది.
మరోవైపు హిమ, సౌర్య ను విహార యాత్ర ప్రదేశంలో ఫోటోలను దిగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కార్తీక్, హిమ, సౌర్య లకు ఫోటోలు తీస్తూ ఉంటాడు. అప్పుడు సౌర్య అమ్మ నువ్వు, నాన్న పక్కన నిలబడండి నేను ఫోటో తీస్తాను అని అంటుంది. ఆ తర్వాత ఆ నలుగురు కలిసి కారులో బయలుదేరుతారు.
Karthika Deepam March 10 Today Episode : హిమ కారును డ్రైవ్… అంతలోనే ప్రమాదం..

ఇక హిమ డాడీ నేను కార్ డ్రైవింగ్ చేస్తాను అని చెప్పి ముందుకు వచ్చి కూర్చుంటుంది. ఇక నలుగురు కలిసి కారులో ప్రేమగా మాట్లాడుతూ వెళుతూ ఉంటారు. ఇక ఇంతలో కార్తీక్ మొబైల్ కు సిగ్నల్ రాగానే సౌందర్య నుంచి వచ్చిన మిస్డ్ కాల్స్ చూసి షాక్ అవుతాడు. అన్ని సార్లు ఎందుకు కాల్ చేసింది అని కార్ పక్కకు ఆపుతాడు. అప్పుడు సౌర్య కూడా కారు దిగి ఫోటోలు దిగుతూ ఉంటుంది. కార్తీక్ పక్కకు వెళ్లి ఫోన్ కోసం ట్రై చేస్తూ ఉంటాడు.
ఇక దీప కార్ దగ్గర నిలబడి ఉండగా, సినిమా కార్ డ్రైవ్ చేస్తా అని అంటుంది. అప్పుడు దీప ఎంత చెప్పినా వినకుండా హిమ కారును స్టార్ట్ చేసి నడపడానికి ప్రయత్నిస్తుంది. అది చూసిన కార్తీక్ కారు ఆపడానికి ప్రయత్నిస్తాడు. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.
Read Also : Karthika Deepam : మద్యం తాగి చిందులేస్తున్న వంటలక్క.. షాక్‌లో మోనిత..?