...

Samantha: శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ ధన్యవాదాలంటూ సామ్ పోస్ట్..!

ఏమాయ చేశావే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైన సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఏప్రిల్ 28 అంటనే నిన్న ఆమె పుట్టిన రోజు. గురువారంతో సామ్ 35వ వసంతంలోకి అడుగు పెట్టింది. అయితే ఈమె పుట్టిన రోజు సందర్భంగా ఎంతో సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. హీరో విజయ్ దేవరకొండ సామ్ పుట్టిన రోజు సందర్భంగా ఓ సర ప్రైజ్ కూడా ఇచ్చారు. అయితే తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన వారందరికీ థాంక్యా చెబుతూ ఓ పోస్ట్ చేసింది.

“నా పుట్టిన రోజు నాడు మీరు నాపై చూపించిన ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. మీ అందరి ప్రోత్సాహం, ప్రేరణ, సానుకూలతలకు నేను ఎప్పటికీ కృతజ్ఞురాలినే.. మనస్ఫూర్తిగా నేను మీ అందర్నీ ప్రేమిస్తున్నా. ఈ ఏడాదిని మరింత ధఐర్యంగా ఎదుర్కునేందుకు మీరు నాలో ఉత్సాహాన్ని నింపారు” అంటూ సామ్ రాసుకొచ్చారు. అయితే సమంత కోలీవుడ్ లో నటించిన కాతుల వక్కుల రెండు కాదల్ సినిమా మంచి స్పందన అందుకుంది.