...

Manjula Paritala: డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న డాక్టర్ బాబు భార్య మంజుల పరిటాల!

Manjula Paritala: తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ఎంత మంచి గుర్తింపు సంపాదించుకుందో మనకు తెలిసిందే. ఈ సీరియల్స్ ద్వారా డాక్టర్ బాబుగా మరింత గుర్తింపు సంపాదించుకున్న నటుడు పరిటాల నిరుపమ్. ఈయనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే విషయం మనకు తెలిసిందే. ఇక ఈయన భార్య నటి మంజుల గురించి కూడా అందరికీ తెలిసిందే.ఈమె పలు సీరియల్స్ లో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేయడమే కాకుండా యూట్యూబ్ ఛానల్ ద్వారా తన భర్త చెల్లెలితో కలిసి ఎన్నో వీడియోలను చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు.

ఇప్పటివరకు ఎంతో మంది బుల్లితెర నటీనటులు బుల్లితెరపై ప్రేక్షకులను సందడి చేశారు. అయితే డాక్టర్ బాబు భార్య మాత్రం ఒక్క అడుగు ముందుకు వేసి మొట్టమొదటిసారిగా డిజిటల్ ప్లాట్ ఫామ్ ఎంట్రీ ఇస్తున్నారు. కొంచెం కారం కొంచెం తీపి పేరుతో యూట్యూబ్, జెమిని టీవీలో సందడి చేయడానికి సిద్ధమైంది. దాదాపు 80 ఎపిసోడ్ లో ప్రసారం కానున్న ఈ సీరియల్ ప్రతి ఒక్కరిని సందడి చేయనుందని తెలుస్తోంది.

నటి మంజుల ఇదివరకు పలు తెలుగు కన్నడ ,సీరియల్స్ లో నటించిన ప్రేక్షకులను సందడి చేసిన ఈమె కొంతకాలం పాటు బుల్లితెర సీరియల్స్ కి దూరమైనప్పటికీ తాజాగా మరోసారి బుల్లితెర పై మాత్రమే కాకుండా డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి కూడా ఎంట్రీ ఇస్తూ ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమయ్యారు. అయితే బుల్లితెరకు దూరమైనప్పటికీ ఈమెకు ఏమాత్రం ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గలేదు. యూట్యూబ్ ఛానల్ ద్వారా నిత్యం ఏదో ఒక వీడియో, లేదా రీల్స్ ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. చాలా కాలం తర్వాత తిరిగి బుల్లితెరపైకి రీ ఎంట్రీ ఇస్తున్నారు.