Chiranjeevi: టాలీవుడ్ స్టార్ హీరోస్ మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన సినిమా ఆచార్య. ఈ సినిమా షూటింగ్ పనులు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. ఇటీవల ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చాలా గ్రాండ్ గా నిర్వహించారు. ఈనెల 29వ తేదీన థియేటర్లలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మెగా అభిమానులు అందరూ ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ హైదరాబాద్ లో జరిగింది.ఈ ప్రెస్ మీట్ లో రామ్ చరణ్, చిరంజీవి, పూజా హెగ్డే, దర్శకుడు కొరటాల శివ పాల్గొన్నారు.
ఈ ప్రెస్ మీట్ లో భాగంగా రామ్ చరణ్ గురించి విలేకరులు అడిగిన ప్రశ్నలకు చిరంజీవి షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఈ ప్రెస్ మీట్ లో ఒక విలేకరి మాట్లాడుతూ ఆచార్య సినిమా షూటింగ్ సమయంలో రామ్ చరణ్ నుండి మీరు ఏం నేర్చుకున్నారు అని చిరంజీవిని ప్రశ్నించగా.. చిరంజీవి స్పందిస్తూ రామ్ చరణ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించాడు .
ప్రెస్మీట్లో విలేకరి అడిగిన ప్రశ్నలకు స్పందించి చిరంజీవి మాట్లాడుతూ..” ఆచార్య షూటింగ్ సమయంలో చేతిలో చరణ్ ని చూస్తుంటే అచ్చం నన్ను నేను చూసుకున్నట్టు ఉంది. షాట్ అయిపోగానే డైరెక్టర్ షాట్ ఒకే అనేదాక ఎదురు చూసి డైరెక్టర్ షాట్ ఓకె అనగానే హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు. షూటింగ్ సమయంలో స్టార్ హీరో అన్న గర్వం లేకుండా చరణ్ అందరితో కలిసి భోజనం చేయటం నాకు చాలా నచ్చింది. షూటింగ్ కోసం మొబైల్ సిగ్నల్ లేని పల్లెటూరిలో 20 రోజుల పాటు కాలేజీలో చరణ్ తో కలిసి ఉన్న రోజులు నా జీవితాంతం గుర్తుండిపోతాయి. అయితే చరణ్ నా భార్య సురేఖ షూటింగ్ కి రాకుండా అడ్డుపడి నాకు అన్యాయం చేశాడు” అని షాకింగ్ కామెంట్స్ చేశాడు.
మరి అందుకు వివరణ ఇస్తూ ” షూటింగ్ జరిగే ప్రాంతంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉందని సురేఖ రమ్మంటే వాళ్ళమ్మని రానివ్వకుండా చేశాడు. 20 రోజులు నేను మాత్రమే నీతో ఉండాలి.ఈ 20 రోజులు నేను తప్ప ఇంకెవరూ మీతో ఉండటానికి నేను ఒప్పుకోను అని చెప్పి నా భార్య నాకు దూరం చేశాడు”. అని చిరంజీవి చెప్పుకొచ్చాడు.
CBSE Admit Card 2025 : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 2025 బోర్డు పరీక్షలకు అడ్మిట్…
NPS Zero Tax : మీరు వేతనజీవులా? ప్రతినెలా జీతం పొందే వ్యక్తి అయితే.. మీకో గుడ్ న్యూస్.. బడ్జెట్…
Vitamin E deficiency : శరీరం సరిగ్గా పనిచేయడానికి అన్ని విటమిన్లు, ఖనిజాలు అవసరం. ఏదైనా విటమిన్ లోపం ఉంటే..…
Lungs Detox : ఊపిరితిత్తులను శుభ్రపరిచే మార్గాలివే : ప్రస్తుత మన జీవనశైలి.. మన ఊపిరితిత్తులపై చాలా చెడు ప్రభావాన్ని…
Ginger Benefits : కీళ్లనొప్పులు, దగ్గు, జలుబు, కడుపునొప్పి, మోషన్ సిక్‌నెస్, వికారం, అజీర్ణం వంటి సందర్భాల్లో అల్లంను ఎక్కువగా…
Vasantha Panchami 2025 : వసంత పంచమి సందర్భంగా సరస్వతీదేవిని ఏ విధంగా పూజిస్తే అదృష్టాన్ని అందిపుచ్చుకోవచ్చు అనేది ఇప్పుడు…
This website uses cookies.