Big Boss Nonstop: బుల్లితెర మీద ప్రసారమైన రియాలిటీ షో లలో బిగ్ బాస్ మంచి ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంది. ఇప్పటికీ ఐదో సీజన్లో పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ప్రస్తుతం సీజన్ ఓటిటి లో నాన్ స్టాప్ గా ప్రసారమవుతుంది. 17 మంది కంటెస్టెంట్ లతో 8 వారాల క్రితం మొదలైన ఈ బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ కూడా ప్రేక్షకుల ఆదరణను సొంతం చేసుకుంది. ప్రతి వారం హౌస్ నుండి ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతూ ఇప్పటివరకు ఎనిమిది మంది కంటెస్టెంట్ లు ఎలిమినేట్ అయ్యారు.పోయిన వారం బాబా భాస్కర్ మాస్టర్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి ప్రవేశించాడు. అయితే ఈ వారం కెప్టెన్సీ కోసం పోటీదారులను ఎన్నుకోవడానికి బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చారు.
‘ హ్యూమన్స్ వర్సెస్ ఏలియన్స్’ అనే ఈ టాస్క్ లో పాల్గొనటానికి ఒక అర్హత ఉండాలని బిగ్ బాస్ ప్రకటించాడు. ఈ టాస్క్ లో భాగంగా బాబా భాస్కర్ మాస్టర్ సంచాలకుడిగా వ్యవహరించారు.అఖిల్, శివ, అషు, అనిల్, మిత్రాలు హ్యూమన్ టీం లో ఉండగా మిగిలిన వారు ఏలియన్స్ టీం లో ఉన్నారు. ఈ టాస్క్ లో భాగంగా హ్యూమన్ టీం లో ఉన్నవారు ఏలియన్స్ దగ్గర ఉన్న కుండలను దొంగలించాలి. అలాగే ఏలియన్స్ టీమ్ లో ఉన్నవారు హ్యూమన్స్ టీమ్ లో ఉన్న వారి అరచేతులకు రంగు పోయాలి.
టాస్క్ లో భాగంగా మిత్రశర్మ స్విమ్మింగ్ పూల్ లో ఉండగా ఆషూ రెడ్డి రంగు పుయటానికి నీళ్లు చల్లింది. ఆషురెడ్డి చేసిన పనికి బిగ్ బాస్ కోపం తో మునుపెన్నడూ బిగ్ బాస్ లో ఇవ్వని పనిష్మెంట్ ఇచ్చాడు. ఆషు నీళ్లు చల్లడం తో మైక్ లు తడిచి పోవటం వల్ల ఒక రోజంతా ఆషురెడ్డి ని మైక్ లేకుండా ఉండమని పనిష్మెంట్ ఇచ్చాడు. మైక్ లేకపోతే బిగ్ బాస్ హౌజ్ లో ఏమి మాట్లాడకూడదు. బిగ్బాస్ ఇలా పనిష్మెంట్ ఇవ్వటంతో ఆషూ కొంత సమయం ఏమీ మాట్లాడకుండా ఉంది. దీంతో బిగ్ బాస్ ఇంకోసారి ఇలా జరగకూడదు అని వార్నింగ్ ఇచ్చి మైక్ తిరిగి ఇచ్చాడు.
Rythu Bharosa : తెలంగాణ సర్కార్ రైతులకు శుభవార్త చెప్పింది. రైతు భరోసా డబ్బులకు సంబంధించి కీలక ప్రకటన చేసింది.…
Jeera Saunf water : మీ ఇంటి వంటగదిలో సులభంగా లభించే అనేక దినుషుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని…
CBSE Admit Card 2025 : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 2025 బోర్డు పరీక్షలకు అడ్మిట్…
NPS Zero Tax : మీరు వేతనజీవులా? ప్రతినెలా జీతం పొందే వ్యక్తి అయితే.. మీకో గుడ్ న్యూస్.. బడ్జెట్…
Vitamin E deficiency : శరీరం సరిగ్గా పనిచేయడానికి అన్ని విటమిన్లు, ఖనిజాలు అవసరం. ఏదైనా విటమిన్ లోపం ఉంటే..…
Lungs Detox : ఊపిరితిత్తులను శుభ్రపరిచే మార్గాలివే : ప్రస్తుత మన జీవనశైలి.. మన ఊపిరితిత్తులపై చాలా చెడు ప్రభావాన్ని…
This website uses cookies.