Devotional Tips: హిందూ ధర్మశాస్త్రం ప్రకారం పలు రకాల వస్తువులను ఎంతో పరమపవిత్రమైనవిగా భావిస్తారు. అందుకే సాక్షాత్తు దైవ సమానమైన వస్తువులను ఎలాంటి పరిస్థితులలో కూడా కింద పెట్టకూడదని పండితులు చెబుతుంటారు. మరి ఆ వస్తువులు ఏమిటి అనే విషయానికి వస్తే…. మన హిందువులు చాలామంది తల్లిదండ్రులు గురువు తర్వాత అత్యంత పరమ పవిత్రమైనదిగా భావించే వాటిలో జంధ్యం ఒకటి. జంధ్యాన్ని సాక్షాత్తు తల్లిదండ్రులుగా భావిస్తారు కనుక పొరపాటున కూడా జంధ్యం కింద పెట్టకూడదు. జంధ్యం కింద పెట్టడం వల్ల మనం తల్లిదండ్రులను అవమానించినట్లే అని పండితులు చెబుతున్నారు.
విష్ణుమూర్తి స్వరూపమైన సాలి గ్రామాన్ని కూడా కింద పెట్టకూడదు. ఇలా సాలిగ్రామం కింద పెట్టడం వల్ల సాక్షాత్తు విష్ణుమూర్తిని అవమానించినట్లని అర్థం. అదేవిధంగా లక్ష్మీస్వరూపమైన శంకువుని కూడా పొరపాటున కూడా కింద పెట్టకూడదు. ఇలా శంఖాన్ని కింద పెట్టడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుంది. అందుకే శంఖం ఎప్పుడూ కూడా కింద పెట్టకూడదు.
ఇక మనం ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఇంట్లో దీపారాధన చేస్తూ ఉంటాము. ఇలా దీపారాధన చేయటం వల్ల ఇల్లు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత దీపాన్ని ఎల్లప్పుడు నేలపై పెట్టకూడదు. అయితే దీపారాధన చేసిన సమయంలో దీపం కింద ఏదైనా చిన్న ఇత్తడి ప్లేట్ లేదా స్టీల్ ప్లేట్ అయినా పెట్టాలి. ఇది కూడా లేని పక్షంలో దీపపు ప్రమిద కింద దీపానికి ఆధారంగా ఒక ఆకు పెట్టిన సరిపోతుంది.ఇలా ఏ విధమైనటువంటి ఆధారం లేకుండా దీపారాధన చేయడం వల్ల మన జీవితానికి కూడా ఎలాంటి ఆధారం ఉండదని అందుకే దీపాన్ని కూడా కింద పెట్టకూడదని పండితులు చెబుతున్నారు.
Tufan9 Telugu News And Updates Breaking News All over World