Telugu NewsEntertainmentగేమ్ ఆన్‌’’ చిత్రం నుండి సెకండ్ లిరికల్ సాంగ్ లాంచ్!

గేమ్ ఆన్‌’’ చిత్రం నుండి సెకండ్ లిరికల్ సాంగ్ లాంచ్!

గీతానంద్, నేహా సోలంకి (90 ఎంఎల్ ఫేమ్ )హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘గేమ్ ఆన్‌’. క‌స్తూరి క్రియేష‌న్స్ ప్రొడ‌క్ష‌న్, గోల్డెన్ వింగ్ ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యాన‌ర్స్‌పై ద‌యానంద్ ద‌ర్శ‌క‌త్వంలో ర‌వి క‌స్తూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు . తమ్ముడి దర్శకత్వంలో అన్న హీరోగా నటించడం విశేషం. మధుబాల, ఆదిత్య మీనన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుండి ‘పడిపోతున్న’ అనే సెకండ్ లిరికల్ సాంగ్ ను చిత్ర బృందం విడుదల చేసింది. కిట్టు విస్సా ప్రగడ సాహిత్యం అందించారు. అశ్విన్- అరుణ్ సంగీతం అందించారు. అనురాగ్ కులకర్ణి – హారిక నారాయణ్ ఆలపించారు. ప్రస్తుతం ఈ పాత సంగీత ప్రియులను ఎంతగానో అలరిస్తోంది.

Advertisement

 

Advertisement

తొలిసారి కాదా ఈ ప్రేమ…

Advertisement

ఎదలోని ఉంది నువ్వేనా..

Advertisement

ఇన్నాళ్లు లేని హైరానా

Advertisement

అలవాటుగానే కలిగేనా

Advertisement

పడిపోతున్న నిన్ను చూస్తూ…

Advertisement

 

Advertisement

ఈ పాటకు కిట్టు విస్సప్రగడ ఇచ్చిన లిరిక్స్ ప్రేమను వ్యక్తపరుస్తుంది. వైవిధ్యమైన వాయిస్ తో అనురాగ్ కులకర్ణి, హారికా నారాయణ్ ఆలపించిన విధానం కొత్తగా ఉంది.

Advertisement

 

Advertisement

ఈ సందర్బంగా నిర్మాత ర‌వి క‌స్తూరి మాట్లాడుతూ, “గతంలో విడుదల చేసిన ‘గేమ్ ఆన్’ టైటిల్, ఫస్ట్ లుక్ మంచి రెస్పాన్స్ వచ్చింది. నవాబ్ గ్యాంగ్ మా సినిమా కోసం చక్కని సంగీతం అందించారు. గతంలో పలు చిత్రాల్లో పని చేసి.. ఇప్పుడు చిరంజీవి హీరోగా నటిస్తున్న భోళా శంకర్ చిత్రానికి టైటిల్ సాంగ్ కి పనిచేశారు. అంత బిజీలోను మా చిత్రానికి అద్భుతమైన సంగీతం అందించారు. ఇపుడు విడుదల చేసిన రెండో పాటకు కూడా స్పందన అదిరింది.

Advertisement

ఆ స్పందనతో సినిమాపై మరింత నమ్మకం పెరిగింది. ఈ సినిమాకు ఇద్దరు అన్న దమ్ములుగా వర్క్ చేస్తున్నారు. ఒకరు హీరోగా, ఒకరు డైరెక్టర్ గా ఈ సినిమా చెయ్యడం విశేషం. వారిద్దరూ కలసి నాకు చెప్పిన కంటెంట్ నచ్చడంతో ఈ సినిమా నిర్మించడం జరిగింది. అందరూ ఎంతో కష్టపడి పనిచేశాం. అర‌వింద్ విశ్వనాథన్ అద్భుతంగా విజువ‌ల్స్ ఇచ్చాడు. ప్ర‌తి ఫ్రేమ్ మిమ్మ‌ల్ని ఓ కొత్త లోకంలోకి తీసుకెళుతుంది. అలాగే ఈ సినిమాకు మేము చేసే ప్రతి ప్రమోషన్ కూడా వినూత్నమైన రీతిలో ఉంటుంది. చిత్రీకరణ , నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసి విడుదల తేదీని ప్రకటిస్తాం ‘ అని అన్నారు.

Advertisement

 

Advertisement

దర్శకుడు ద‌యానంద్ మాట్లాడుతూ ‘‘రొటీన్ సినిమాలకు భిన్నంగా ఉండే కథ. తెలుగులో ఇప్పుడు డిఫ‌రెంట్ సినిమాలు రావడమే కాదు.. స‌క్సెస్ కూడా అవుతున్నాయి. ఓ మార్క్ క్రియేట్ చేస్తున్నాయి. ఆ కోవ‌లోనే గేమ్ ఆన్ సినిమా ఉంటుంద‌ని భావిస్తున్నాను. ట్విస్టులు, ట‌ర్నులతో ఆధ్యంతం ఆసక్తిగా సాగుతుంది, మేము చెప్పిన కథను నమ్మి సినిమా చెయ్యడానికి వచ్చిన నిర్మాతకు ధన్యవాదాలు. తను ఆస్ట్రేలియా లో ఉన్నా కూడా ఎంతో యాక్టీవ్ గా ప్రతి విషయంలో అప్డేట్ లో ఉంటాడు. ఇలాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి కావాలి. ముఖ్యంగా మా బ్రదర్ పై నమ్మకం పెట్టి ఈ కథ రాసుకుని ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాను. ఈ సినిమాకు హీరోగా, దర్శకుడుగా మేము ఇద్దరు అన్నదమ్ములం పోటీగా వర్క్ చేస్తున్నాము. ఈ సినిమాలో యాక్ష‌న్‌, రొమాన్స్. ఎమోష‌న్స్… అన్ని రకాల ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఆక‌ట్టుకుంటాయి” అని అన్నారు.

Advertisement

 

Advertisement

న‌టీన‌టులు:

Advertisement

 

Advertisement

గీతానంద్‌, నేహా సోలంకి, ఆదిత్య మీన‌న్, మ‌ధుబాల‌, వాసంతి, కిరిటీ, శుభ‌లేక సుధాక‌ర్‌ త‌దిత‌రులు

Advertisement

బ్యాన‌ర్స్‌: క‌స్తూరి క్రియేష‌న్స్ ప్రొడ‌క్ష‌న్‌, గోల్డెన్ వింగ్ ప్రొడ‌క్ష‌న్స్‌

Advertisement

నిర్మాత‌: ర‌వి క‌స్తూరి

Advertisement

ద‌ర్శ‌క‌త్వం: ద‌యానంద్‌

Advertisement

మ్యూజిక్‌: న‌వాబ్ గ్యాంగ్‌, అశ్విన్ – అరుణ్‌

Advertisement

సినిమాటోగ్రఫీ: అర‌వింద్ విశ్వ‌నాథ‌న్‌

Advertisement

డైలాగ్స్‌: విజ‌య్ కుమార్ సి.హెచ్‌

Advertisement

ఒరిజిన‌ల్ బ్యాగ్రౌండ్ స్కోర్‌: అభిషేక్ ఎ.ఆర్‌

Advertisement

ఎడిట‌ర్ : వంశీ అట్లూరి

Advertisement

ప్రొడ‌క్ష‌న్ డిజైనింగ్‌: దిలీప్ జాన్‌, రాజ్ క‌మ‌ల్‌

Advertisement

స్టంట్స్‌: రామ‌కృష్ణ‌న్‌, న‌భా స్టంట్స్‌

Advertisement

కాస్ట్యూమ్స్‌: మ‌నోజ్‌

Advertisement

పి.ఆర్‌.ఒ: మధు వి. ఆర్.

Advertisement
Advertisement
admin
adminhttps://tufan9.com/
Tufan9 Telugu News And Updates Breaking News All over World
RELATED ARTICLES

తాజా వార్తలు