...

Paruchuri Venkateswara Rao: గుర్తుపట్టలేని స్థితిలోకి వెళ్లిన పరుచూరి వెంకటేశ్వరరావు… షాక్ లో అభిమానులు!

Paruchuri Venkateswara Rao:తెలుగు సినిమా ఇండస్ట్రీలో పరుచూరిబ్రదర్స్ సేవల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తెలుగు సినిమా ఇండస్ట్రీలో పరుచూరి బ్రదర్స్ కి ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. వీరిద్దరూ కలిసి కొన్ని వందల సినిమాలకు రచయితగా పనిచేశారు. వీరి కలం నుంచి జాలువారిన అద్భుతమైన కథతో సినిమాలను తెరకెక్కించి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నారు. సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోల నుంచి చిన్న హీరోల వరకు అందరితో కలిసి పనిచేసి ఎంతో మంచి గుర్తింపు పొందారు.

ఈ విధంగా రచయితలుగా దశాబ్దకాలం పాటు ఇండస్ట్రీలో చక్రం తిప్పిన పరుచూరి బ్రదర్స్ లో పెద్దవారైనా పరుచూరి వెంకటేశ్వరరావు రచయితగా మాత్రమే కాకుండా నటుడిగా కూడా పలు సినిమాలలో నటించారు.ఇలా ఒకానొక సమయంలో ప్రేక్షకులను ఎంతో సందడి చేసిన పరుచూరి వెంకటేశ్వరరావు ప్రస్తుతం వృద్ధాప్య దశలోకి వెళ్ళిపోయారు.ఈ విధంగా వృద్ధాప్య దశలో ఎంతో కృంగిపోతున్న పరుచూరి వెంకటేశ్వరరావుని దర్శకులు జయంత్‌ సి పరాంజి కలిసి పరామర్శించారు. ఈ క్రమంలోనే దర్శకుడు జయంత్ పరుచూరి వెంకటేశ్వరరావుతో కలిసి దిగిన ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

ఈ సందర్భంగా ఈ ఫోటోని షేర్ చేసిన జయంత్..నా గురువుగారు పరుచూరి వెంకటేశ్వరరావు ప్రస్తుతం ఇలాంటి పరిస్థితుల్లోకి వెళ్లడం చాలా బాధగా ఉంది. ఆయన వృద్ధాప్య సమస్యలను ఎదుర్కొంటున్నప్పటికీ ఆయన మానసిక పరిస్థితి నిలకడగా ఉందని సోషల్ మీడియా వేదికగా తనతో దిగిన ఫోటోని షేర్ చేస్తూ ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేశారు. ఇక ఆయన రచించిన 300 ల సినిమాలలో 200 సినిమాలు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయని వెల్లడించారు.ప్రస్తుతం పరుచూరి వెంకటేశ్వరరావుకి సంబంధించిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది అభిమానులు ఈయనను చూసి ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. అలాగే మరికొందరు గురువు గారు ఏంటి ఇలా అయిపోయారు అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.