Mahesh babu : సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రేమ గురించి ఆయన సోదరి మంజుల పలు ఆసక్తికర కామెంట్లు చేశారు. మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణకు మొత్తం ఐదుగురు సంతానం కాగా.. వారిలో రమేష్ బాబు పెద్దవాడనే విషయం అందరికీ తెలిసిందే.
ఆ తర్వాత మంజుల, పద్మావతి, ప్రియదర్శిని అనే ముగురు ఆడ పిల్లలు. చివరగా మహేష్ బాబు జన్మించాడు. వీరిలో రమేష్ బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చి తర్వాత అది కలిసి రాకపోవడంతో నిర్మాతగా పలు సినిమాలు చేస్తూ వచ్చారు.

తాజాగా మంజుల మంచు లక్ష్మితో కలిసి ఒక వీడియో చాట్ సెషన్ నిర్వహించింది. ఈ సందర్భంగా మహేష్ బాబు గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పమని మచు లక్ష్మీ కోరడంతో..
మహేష్ బాబు ప్రేమ గురించి మంజుల ఆసక్తికరమైన వియషయాన్ని బయట పెట్టింది. మహేష్ బాబు తాను ఎప్పుడూ మంచి మార్గంలో ఉండేలా గైడ్ చేస్తూ ఉంటాడని మంజుల అన్నారు.
బేసిక్ గా తనకి కొంచెం కన్ ఫ్యూజన్ ఎక్కువ అని ఏం చేయాలో ఎలా చేయాలో అని కన్ ఫ్యూస్ అవుతున్న సమయంలో మహేష్ తనను కరెక్ట్ గా ఏం చేయాలో అర్థం అయ్యేలా చెబుతాడని ఆమె చెప్పుకొచ్చారు.
అంతేకాకుండా తన తల్లి అప్పుడప్పుడూ చెబుతూ ఉంటారని మహేష్ కి ప్రేమ లోపల ఉంటుందని దాన్ని బయటకు వ్యక్తం చేయడం ఇష్టం ఉండదని ఆమె అన్నారు. పుట్టిన రోజు నాడు ఫోన్ చేసి ఈరోజు ప్లాన్స్ ఏంటని అడుగుతాడే తప్ప హ్యాపీ బర్త్ డే అని మాత్రం చెప్పడని చెప్పుకొచ్చారు.
READ Also : Kajal-Allu Arjun : కాజల్, అల్లు అర్జున్ పెళ్లి జరగకుండా అడ్డుకున్నది ఎవరో తెలుసా..?
- RGV Comments : ఆర్జీవీ మరో సంచలనం.. అల్లు అర్జున్ సూపర్.. రజినీ, చిరు, మహేశ్ బాబు అందరూ వేస్టేనట..!
- Mahesh Babu : ఆ హీరోయిన్‌తో సినిమా చేయనని తెగేసి చెప్పిన మహేశ్‌బాబు.. కంగుతిన్న డైరెక్టర్..!
- Sarkaru Vaari Paata: మహేష్ బాబు సినిమాని నెగిటివ్ కామెంట్స్ తో ట్రోల్ చేస్తున్న పవన్ ఫ్యాన్స్… కారణం ఆదేనా?
















