CAT 2024 Results : ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్యాట్ (IIM CAT 2024 Results) 2024 ఫలితాలు వచ్చేశాయి. ఐఐఎమ్ కలకత్తా క్యాట్ 2024 పరీక్ష ఫలితాలను ప్రకటించింది. ఈ పరీక్ష పలితాల్లో 14 మంది విద్యార్థులు 100 పర్సంటైల్ మార్కులు సాధించారు. కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్)కి హాజరైన అభ్యర్థులు ఇప్పుడు తమ స్కోర్‌లను అధికారిక వెబ్‌సైట్ (iimcat.ac.in)లో క్యాట్ అప్లికేషన్ లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌ని ఉపయోగించి చెక్ చేయవచ్చు లేదా డైరెక్ట్ లింక్ ద్వారా ఫలితాలను పొందవచ్చు.
అభ్యర్థుల స్కోర్‌కార్డులను పరీక్ష అధికారిక వెబ్‌సైట్ iimcat.ac.inలో అప్‌లోడ్ చేసింది. క్యాట్ 2024 పరీక్షను ఐఐఎమ్ కలకత్తా 24 నవంబర్ 2024న నిర్వహించింది. దేశవ్యాప్తంగా 385కి పైగా పరీక్షా కేంద్రాల్లో 3 షిఫ్టుల్లో పరీక్ష నిర్వహించారు. అంతకుముందు, ఐఐఎమ్ కలకత్తా డిసెంబర్ 3న పరీక్ష ప్రొవిజనల్ ఆన్సర్ కీని విడుదల చేసింది. ఆ తర్వాత ఫైనల్ ఆన్సర్ కీ డిసెంబర్ 16న విడుదల చేసింది.
3.29 లక్షల మంది రిజిస్టర్ అయిన అభ్యర్థుల్లో 2.93 లక్షల మంది ఇంజినీరింగ్ విద్యార్థులు, పురుష అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. 100 పర్సంటైల్ సాధించిన 14 మందిలో 13 మంది ఇంజనీర్లు ఉన్నారు.
లింగం పరంగా టాప్ సాధించిన వారిలో 13 మంది పురుషులు, ఒక మహిళ ఉన్నారు. మొత్తం 29 మంది అభ్యర్థులు 99.99 పర్సంటైల్ సాధించారు. 25 మంది ఇంజినీరింగ్, నలుగురు నాన్ ఇంజనీరింగ్ బ్యాక్ గ్రౌండ్ కలిగి ఉన్నారు. ఈ గ్రూపులో 27 మంది పురుషులు, కేవలం ఇద్దరు మహిళలు ఉన్నారు. కాగా, 30 మంది విద్యార్థులు 99.98 పర్సంటైల్ సాధించారు.
స్కోర్ కార్డు ఏడాది వరకు చెల్లుబాటు :
క్యాట్ పరీక్ష 2024 స్కోర్‌కార్డ్ వ్యవధి డిసెంబర్ 2025కి పనిచేస్తుంది. ఈ పరీక్ష స్కోర్‌కార్డ్ ఒక సంవత్సరం పాటు చెల్లుబాటు అవుతుంది. క్యాట్ 2024 పరీక్ష నవంబర్ 24,2024న 170 నగరాల్లోని 389 పరీక్షా కేంద్రాలలో నిర్వహించారు. మొత్తం పరీక్ష మూడు షిఫ్టులలో జరిగింది.
ఉదయం 8:30 నుంచి 10:30, మధ్యాహ్నం 12:30 నుంచి 2:30, సాయంత్రం 4:30 నుంచి సాయంత్రం 6:30 వరకు జరిగాయి. 120 నిమిషాల పాటు ఈ పరీక్ష కొనసాగింది. ఒక్కో విభాగానికి 40 నిమిషాలు కేటాయించారు. డిసెంబరు 3న ప్రొవిజినల్ ఆన్సర్ కీ విడుదల అయింది. ఫైనల్ కీని డిసెంబర్ 17న రిలీజ్ చేశారు. ఫైనల్ కీలో ఎలాంటి మార్పులు లేవని నిర్ధారిస్తూ అభ్యంతరాల విండో డిసెంబర్ 5 నాటికి క్లోజ్ అయింది.
Read Also : Kidney Stones : శరీరంలో నీరు తగినంత లేకుంటే ఈ ప్రాణాంతక వ్యాధి వస్తుంది జాగ్రత్త.. రోజుకు ఎంత నీరు తాగాలంటే?
Diwali 2024 : దీపావళి పండుగ రోజున మహాలక్ష్మి దేవి ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ పూజలో తామర…
Paneer Mughalai Dum Biryani : పన్నీర్ ముఘలాయ్ ధమ్ బిర్యానీ ఎప్పుడైనా తిన్నారా? అయితే, ఇప్పుడు ఓసారి ట్రై…
Kidney Stones : నీరు జీవనాధారం.. నీరు లేకుండా ఏ జీవి కూడా బతకలేదు. ఈ మాటను చిన్నప్పటినుంచి వినే…
Senior Actress : వెండితెరపై ఎందరో బాలనటులుగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత ప్రముఖ నటులుగా రాణించారు. సినిమా పరిశ్రమలో…
Gold Rate Silver Rate Today : బంగారం కొంటున్నారా? కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. బంగారం కొంటే ఇప్పుడే కొనేసుకోవడం…
Uric Acid cause Gout : మనిషి తను తీసుకునే ఆహారం ద్వారా శరీరానికి అవసరమైన మేర శక్తి లభిస్తుంది.…
This website uses cookies.