Yama Deepam 2021 : పట్టణాలు, గ్రామాలు అని తేడాలేకుండా దేశవ్యాప్తంగా దీపావళిని అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ప్రతి ఇల్లు దీపాలతో, విద్యుత్ వెలుగులతో వెలిగిపోతోంది. దీపావళి అంటేనే దీపాల పండగు. అందుకే ఇల్లు మొత్తం దీపాలతో అలకరించి.. లక్ష్మీ దేవిని ఘనంగా పూజిస్తారు. దీపావళికి ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి. సాధారణంగా ఈ పండుగను మూడు రోజులు జరుపుకుంటారు. దేశంలోని పలు ప్రాంతాల్లో 5 రోజులు కూడా జరుపుకుంటారు.
అశ్వయుజ బహుల త్రయోదశి(ధన త్రయోదశి) మొదలు కార్తీక శుద్ధ విదియ (ప్రీతి విదియ) వరకు ఐదు రోజులు పండుగ చేస్తారు. దీపావళిలో మరో ముఖ్యమైన విషయం గురించి తెలుసుకోవాల్సిందే. దీపం దక్షిణ వైపు మాత్రమే పెట్టాలని పెద్దలు చెబుతుంటారు.
దానికో కారణం ఉంది. దక్షిణ వైపు పెంటే దీపాన్ని యమ దీపం అంటారు. ధన త్రయోదశి నాడు తమ వారసులను అనుగ్రహించడానికి పితృదేవతలు కిందికి దిగి వస్తారని పెద్దలు చెబుతుంటారు. వారికి దారి చూపడానికి ఇంట్లో దక్షిణం వైపు దీపం పెట్టాలని అంటుంటారు. ఇలా, యమదీపారాధాన చేసిన వారి అపమృత్యు దోషాలు తొలిగిపోతాయని నమ్ముతుంటారు. అయితే, తల్లిదండ్రులు మరణించిన వారు మాత్రమే ఈ యమ దీపం పెడతారు.
Read Also : Tamarind Seeds : చింతగింజలతో ఇలా చేస్తే ఈ నొప్పులు జన్మలో రావు..!!
Tufan9 Telugu News providing All Categories of Content from all over world