Categories: DevotionalLatest

Vinayaka Chavithi 2022: వినాయక చవితి పూజా విధానం.. ఈ తప్పులు అస్సలే చేయకడూదు!

Vinayaka Chavithi 2022: నేడే వినాయక చవితి అనే విషయం అందరికీ తెలిసిందే. భాద్రపద శుద్ధ చవితి రోజునే వినాయక చవితి పండుగను చేస్కుంటారు. ఈరోజే వినాయకుడు పుట్టాడని.. గమాధిపత్యం పొందాడని పలు పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి. అయితే చాలా మంది ఇంట్లో వినాయకుడిని పెట్టుకుంటారు కానీ ఈ వ్రతం ఎలా చేస్కోవాలో చాలా మందికి తెలియదు. అయితే ఎలాంటి తప్పులు లేకుండా విఘ్నేశ్వరుడి పూజ ఎలా చేస్కోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

పొద్దునే లేచి స్నానం చేయాలి. ఆ తర్వాత ఇంటిని శుభ్రం చేస్కొని మామిడాకులతో తోరణాలు కట్టారి. ఇంటిని చక్కగా అలంకరించుకోవాలి. ఓ పీటకు పసుసు రాసి ఇంటికి ఈశాన్య భాగంలో లేదా ఉత్తర దిక్కులో ఉంటాలి. ఓ పళ్లెంలో బియ్యం పోసి వాటిపై తమలపాకులు పెట్టుకోవాలి. అగరవత్తులు వెలిగించి దీపారాధన చేయాలి. ఆ తర్వాత అగరవత్తులు వెలిగించి.. ఈ మంత్రాన్ని చదువుతూ పూజను ప్రారంభించాలి.

భూతోచ్ఛాటనము..

Advertisement

ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమి భారకాః
ఏతేషా మవిరోధేన బ్రహ్మకర్మ సమారభే
శ్లోకము చదివి అక్షతలు కొన్ని వాసన చూసి ఎడమచేతి ప్రక్కనుండి వెనుకకు వేసుకోవాలి. అథః ప్రాణాయామః (కుడి చేతి బొటన వ్రేలు, మధ్య వ్రేలులతో రెండు నాసికాపుటములను బంధించి) ఓం భూః, ఓం భువః , ఓగ్0 సువః, ఓం మహః ఓం జనః, ఓం తపః , ఓగ్0 సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం, భర్గో దేవస్య ధీమహి, ధీయోయనః ప్రచోదయాత్
ఓం ఆపో జ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం, (మూడు సార్లు జపించవలెను)
అనంతరం అక్షతలు తీసుకుని సంకల్పం చెప్పుకోవాలి.

సంకల్పము

Advertisement

ఓం మమోపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిస్య,శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభే, శోభన ముహూర్తే, శ్రీ మహావిష్ణో రాజ్ఞయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే, శ్వేత వరాహకల్పే, వైవస్వత మన్వంతరే,కలియుగే,ప్రథమపాదే జంబూద్వీపే,భరతవర్షే, భరతఖండే, మేరోర్దక్షిణదిగ్భాగే,కృష్ణా – గోదావర్యోర్మధ్యదేశే (మీరు ఉన్న ఊరికి ఉత్తర దక్షిణములలో ఉన్న నదుల పేర్లు చెప్పండి) అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన (ప్రస్తుత సంవత్సరం) సంవత్సరే (ఉత్తర/దక్షిణ) అయనే (ప్రస్తుత ఋతువు) ఋతౌ (ప్రస్తుత మాసము) మాసే (ప్రస్తుత పక్షము) పక్షే (ఈరోజు తిథి) తిథౌ (ఈరోజు వారము) వాసరే (ఈ రోజు నక్షత్రము) శుభ నక్షత్రే (ప్రస్తుత యోగము) శుభయోగే, శుభకరణే. ఏవం గుణ విశేషణ విశిష్టాయాం, శుభతిథౌ,శ్రీమాన్ (మీ గోత్రము) గోత్రస్య (మీ పూర్తి పేరు) నామధేయస్య, ధర్మపత్నీ సమేతస్య అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృద్ధ్యర్థం , ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిధ్యర్థం, ఇష్టకామ్యార్ధ సిద్ధ్యర్ధం, సర్వాపదా నివారణార్ధం, సకల కార్యవిఘ్ననివారణార్ధం, సంభవద్భిః ద్రవ్యైః సంభవద్భిః పదార్థైః సంభవద్భిః ఉపచారైః సంభవితా నియమేన, యావచ్ఛక్తి, శ్రీ మహా గణాధిపతి దేవతా ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే… అంటూ అక్షతలు ఉదకం పళ్ళెంలో విడువవలెను.

షాడోపచార పూజ..

Advertisement

శ్లో. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ అవిఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా॥
ఓం శ్రీమహాగణపతయే నమః :- ధ్యాయామి – ధ్యానం సమర్పయామి. (ఒక పుష్పమును దేవుడి/దేవి వద్ద వుంచవలెను)
ఓం శ్రీమహాగణపతయే నమః :- ఆవాహయామి (ఆహ్వానిస్తూ ఒక పుష్పమును దేవుడి/దేవి వద్ద వుంచవలెను)
ఓం శ్రీమహాగణపతయే నమః :- రత్న సింహాసనం సమర్పయామి (కొన్ని అక్షతలు సమర్పించవలెను)
ఓం శ్రీమహాగణపతయే నమః :- పాదయోః పాద్యం సమర్పయామి ( పుష్పం తో నీరు దేవుడి/దేవి కి పాదములు కడగాలి – కడిగినట్టు భావించాలి )
ఓం శ్రీమహాగణపతయే నమః :- హస్తయోః అర్ఘ్యం సమర్పయామి (పుష్పంతో నీరు దేవుడి/దేవికి చేతులు కడగాలి – కడిగినట్టు భావించాలి )
ఓం శ్రీమహాగణపతయే నమః :- ముఖే ఆచమనీయం సమర్పయామి (పుష్పంతో నీరు దేవుడి/దేవి కి ముఖం కడుగుటకు ఇవ్వాలి ).
ఓం శ్రీమహాగణపతయే నమః :- మధుపర్క స్నానం కరిష్యామి రూపేణ అర్ఘ్యం సమర్పయామి (పుష్పం తో నీరు దేవుడి / దేవికి మధుపర్క స్నానానికి సమర్పించాలి)
ఓం శ్రీమహాగణపతయే నమః :- శుద్ధోదక స్నానం సమర్పయామి. (పుష్పం తో నీరు దేవుడి. దేవికి స్నానం చేస్తున్న భావన చేస్తూ సమర్పించాలి)
ఓం శ్రీమహాగణపతయే నమః :- వస్త్ర యుగ్మం సమర్పయామి – వస్త్ర యుగ్మం రూపేణ అక్షతాన్ సమర్పయామి (వస్త్రము అలంకరిస్తున్న భావన చేస్తూ అక్షతలు సమర్పించాలి).
ఓం శ్రీమహాగణపతయే నమః :- ముఖ ధారణార్థం తిలకం సమర్పయామి (కుంకుమ ధారణ చేయాలి).
ఓం శ్రీమహాగణపతయే నమః :- యజ్ఞోపవీతం సమర్పయామి – యజ్ఞోపవీతార్ధం అక్షతాన్ సమర్పయామి(అక్షతలు వేయాలి).
ఓం శ్రీమహాగణపతయే నమః :- శ్రీ గంధాం ధారయామి – (గంధం సమర్పించాలి).
ఓం శ్రీమహాగణపతయే నమః :- సర్వాభరణాన్ ధారయామి (అక్షతలు సమర్పించాలి).
ఓం శ్రీమహాగణపతయే నమః :- సమస్త పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి (పువ్వులు/ అక్షతలు సమర్పించాలి).
ఓం శ్రీమహాగణపతయే నమః :- (యథా శక్తి మన ఇష్ట దైవము యొక్క మంత్ర జపమును, అష్టోత్తర శత నామాన్ని, కాని లేదా ప్రార్థన శ్లోకము ను గాని చదువుకొన వలెను.
ఓం సుముఖాయ నమః,
ఓం ఏకదంతాయ నమః,
ఓం కపిలాయ నమః,
ఓం గజకర్ణాయ నమః,
ఓం లంబోదరాయ నమః,
ఓం వికటాయ నమః,
ఓం విఘ్నరాజాయ నమః,
ఓం ధూమకేతవే నమః,
ఓం గణాధ్యక్షాయ నమః,
ఓం ఫాలచం ద్రాయ నమః,
ఓం గజాననాయ నమః
ఓం వక్రతుండాయ నమః,
ఓం శూర్పక ర్ణాయ నమః,
ఓం హేరంభాయ నమః,
ఓం స్కందపూర్వజాయ నమః,
ఓం గణాధిపతయే నమః.
షోడశ నామ పూజా సమర్పయామి

ఓం శ్రీమహాగణపతయే నమః :- ధూపమాఘ్రాపయామి (అగరుబత్తి వెలిగించి దేవుడికి/ దేవికి చూపించాలి)
ఓం శ్రీమహాగణపతయే నమః :- దీపం దర్శయామి (దీపం చూపించాలి).
ఓం శ్రీమహాగణపతయే నమః :- నైవేద్యం సమర్పయామి (నివేదనార్పణా విధి: నివేదన చేయు పదార్థముల చుట్టూ గాయత్రి మంత్ర స్మరణ చేస్తూ
ఓం భూర్భువస్సువః తత్స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్ (అంటూ కొంచెం జలమును చిలకరించి)
సత్యం త్వర్తేన పరిషం చామి (మూడు సార్లు పుష్పముతో గాని , ఉద్ధరిణి తో గాని అన్నింటి చుట్టూ సవ్య దిశ లో (ఎడమ నుండి కుడి వైపుకు ) తిప్పాలి.
అమృతమస్తు (నైవేద్యం పై జలమును వుంచి) అమృతోపస్తర ణమసి (అదే నీటిని దేవుడి / దేవి వద్ద ) ఉంచాలి.
దిగువ మంత్రములతో భగవంతునికి ఆరగింపు (తినిపిస్తున్నట్టు – బొటన వేలు, మధ్య వేలు, ఉంగరం వేళ్ళ తో ) చూపవలెను.
ఓం ప్రాణాయ స్వాహా– ఓం అపానాయ స్వాహా — ఓం వ్యానాయ స్వాహా — ఓం ఉదానాయ స్వాహా — ఓం సమానాయ స్వాహా –ఓం పరబ్రహ్మణే నమః — అంటూ నివేదించవలెను.
ఓం శ్రీమహాగణపతయే నమః :- తాంబూలం సమర్పయామి – తాంబూలం రూపేణ అక్షతాన్ సమర్పయామి.(తాంబూలం చూపించుట కానీ, అక్షతలు గాని సమర్పించాలి).
ఓం శ్రీమహాగణపతయే నమః :- కర్పూర ఆనంద నీరాజనం సమర్పయామి (కర్పూర హారతి ఇవ్వాలి).
ఓం శ్రీమహాగణపతయే నమః :- మంత్ర పుష్పం సమర్పయామి (అక్షతలు, పువ్వులు సమర్పించవలెను).
ఓం శ్రీమహాగణపతయే నమః :- నమస్కారం సమర్పయామి (ఆత్మ ప్రదక్షిణ నమస్కారములు చేయవలెను)
శ్లో యానికానిచ పాపాని జన్మాంతర క్రుతానిచా
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే
పాపో౽హం పాప కర్మాహం పాపాత్మా పాప సంభవ
త్రాహి మాం నరకాత్ ఘోరాత్ శరణాగత
అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం
తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష గణాధిప

Advertisement

ఓం శ్రీమహాగణపతయే నమః :- గీతం శ్రావయామి, నృత్యం దర్శయామి, ఆందోళిక నారోహమావహయామి, అశ్వా నారోహమావహయామి, గజనారోహమావాహయామి
ఓం శ్రీమహాగణపతయే నమః :- సమస్త శక్త్యోపచారాన్, రాజ్యోపచారాన్, భక్త్యోపచారాన్, దేవ్యోపచారాన్ సమర్పయామి.
(అంటూ అక్షతలు సమర్పించవలెను).
అనయా, యథా శక్తి, మయా కృత ధ్యానావాహనాది షోడశోపచార పూజాయచ – శ్రీ విఘ్నేశ్వర దేవతా సుప్రసన్నా, సుప్రీతా వరదో భవతు.
ఓం శ్రీమహాగణపతయే నమః :- (మనం యథా శక్తి చేసిన పూజలకు భగవంతుడు ప్రీతి చెంది మన కోరికలను తీర్చి, మనలను కాపాడాలని కోరుకుంటూ ) కాయేన వాచా మనసేంద్రియై ర్వాబుద్ధ్యాత్మనావా ప్రకృతేః స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారయణాయేతి సమర్పయామి

ఉద్వాసన

Advertisement

‘ఓం యజ్ఞేన యజ్ఞ మయజంత దేవాః
తాని ధర్మాణి, ప్రధమాన్యాసన్
తేహ నాకం మహిమానస్ప చంతే
యత్ర పూర్వే సాధ్యా స్సంతి దేవాః

Advertisement
tufan9 news

Recent Posts

Top 10 Foods Diabetics : డయాబెటిస్ ఉన్నవారు తినకూడని ఆహార పదార్థాలపై ఫుల్ తెలుగు గైడ్..!

Top 10 Foods Diabetics : చక్కెర, జంక్, గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) ఆహారాలకు దూరంగా ఉండాలి. డయాబెటిక్ ఉన్నవారు…

23 hours ago

Varahi Navaratri 2025 : వారాహి నవరాత్రులు.. ఎవరు చేయాలి.. ఎవరూ చేయకూడదు? తేలికైనా పూజా విధానం..!

Varahi Navaratri 2025 : ఈ వారాహి గుప్తనవరాత్రుల్లో పూజలను ఎవరు చేయాలి? అందరూ చేయొచ్చా? ఎవరూ చేయకూడదు? వారాహి…

1 week ago

Ashada Amavasya 2025 : ఆషాఢ అమావాస్య నాడు పూర్వీకులు భూమిపైకి వస్తారు.. ఈ రోజున కచ్చితంగా ఈ ఒక్క పని చేయండి..

Ashada Amavasya 2025 : జూలై 25 ఆషాఢ మాసంలో అమావాస్య రోజు. ఈ రోజున పూర్వీకుల ఆత్మలు భూమికి…

1 week ago

Ashadha Amavasya : 2025 ఆషాఢ అమావాస్య ఎప్పుడు? ఏ తేదీన వస్తుంది? ప్రాముఖ్యత ఏంటి?

Ashadha Amavasya : ఈ రోజు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. పితృ పూజకు ప్రసిద్ధి చెందింది. ఈ రోజున…

1 week ago

WI vs AUS Test : వెస్టిండీస్ vs ఆస్ట్రేలియా లైవ్.. టెస్ట్ సిరీస్‌ ఎప్పుడు, ఎక్కడ? భారత్‌లో లైవ్ స్ట్రీమింగ్ ఎలా చూడాలి?

WI vs AUS Test : జూన్ 25న బార్బడోస్‌లో ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో వెస్టిండీస్ ఆస్ట్రేలియాకు…

1 week ago

TG EDCET Result 2025 : తెలంగాణ EDCET 2025 రిజల్ట్స్ విడుదల.. ర్యాంక్ కార్డ్ ఇలా డౌన్‌లోడ్ చేయండి

TG EDCET Result 2025 : టీఎస్ EDCET రిజల్ట్స్ 2025 విడుదల అయ్యాయి. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక…

1 week ago

This website uses cookies.