#Govt Jobs #Govt jobs #Govt jobs #Govt jobs #Govt jobs #Govt jobs #Govt jobs #Govt jobs #Govt jobs #Govt jobs #Govt jobs

Mahashivaratri 2026 : మహాశివరాత్రి రోజున ఏయే దానధర్మాలు చేయాలి? ఇలా చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయంటే?

By Ramesh Babu

Published on: February 15, 2026

Follow Us

Mahashivaratri 2026

---Advertisement---

Mahashivaratri 2026 : మహాశివరాత్రి శివపార్వతుల కలయికకు గుర్తుగా జరుపుకునే పవిత్ర పండుగ. 2026 ఏడాదిలో మహాశివరాత్రి ఫిబ్రవరి 15న జరుపుకుంటారు. ఈరోజు సాయంత్రం 5:04 గంటలకు ప్రారంభమై ఫిబ్రవరి 16న సాయంత్రం 5:34 గంటలకు ముగుస్తుంది.

మత విశ్వాసాల ప్రకారం.. ఈ రోజున పూజ, దాతృత్వం ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. సరైన (Mahashivaratri 2026) వస్తువులను దానం చేయడం వల్ల పాపాలు పోవడమే కాకుండా శ్రేయస్సు, శాంతి లభిస్తాయి. ఈ పవిత్రమైన పండుగ సందర్భంగా మీకు ఏయే దానాలు చేయాలి? ఏ దానాలు చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి? అనేది వివరంగా తెలుసుకుందాం.

మహాశివరాత్రి రోజున ఆహారాన్ని దానం చేస్తే మహా గొప్ప దానంగా పిలుస్తారు. ఆకలితో లేదా అవసరమైన వ్యక్తికి ఆహారం అందించడం ద్వారా కోటి జన్మల పుణ్యం దక్కుతుంది.
ఈ రోజున బియ్యం, చక్కెర ముడి ధాన్యాలు దానం చేస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి.

Read Also : Mahashivratri 2026 : మహాశివరాత్రి రోజున రుద్రాభిషేకం తర్వాత ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి.. ఏం జరుగుతుందంటే?

శివుడికి తెలుపు రంగు అంటే చాలా ఇష్టం. పాలు, పెరుగు లేదా నెయ్యి వంటి తెల్లటి ఆహార పదార్థాలను దానమిస్తే మీ జీవితంలో ఆనందం వెల్లువిరుస్తుంది. ఈ దానంతో మీ మనస్సు కూడా ప్రశాంతంగా ఉంటుంది. చంద్రుని స్థానం కూడా బలపడుతుంది. బలపరుస్తుంది. భక్తితో ఆహారాన్ని దానం చేస్తే ఇంట్లో శ్రేయస్సుతో పాటు పుణ్యాన్ని సంపాదించుకోవచ్చు.

Mahashivaratri 2026 : బట్టలు, వివాహ సామాగ్రి దానం :

మహాశివరాత్రి రోజున పేదలకు బట్టలు దానం చేయడం చాలా మంచిది. ఈ రోజున అవసరమైన వారికి శుభ్రమైన వైట్ లేదా ఎల్లో కలర్ దుస్తులను బహుమతిగా ఇవ్వండి. అంతేకాదు.. మహాశివరాత్రి శివుడు, పార్వతి దేవి కల్యాణం జరుగుతుంది.

కావునా పెళ్లి అయిన మహిళలు ఎరుపు కండువా, గాజులు, వివాహ ఆభరణాలు, వస్తువులను దానం చేయాలి. ఈ దానం వివాహ జీవితంలో శాంతి, ఆనందాన్ని తెస్తుందని నమ్ముతారు. ఇతరులకు సాయం చేస్తే శివుని నుంచి అనుగ్రహం కలుగుతుంది. జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను తొలగిస్తుంది.

నువ్వులు, బెల్లం దానం ఇస్తే విజయం మీ సొంతం :

మహాశివరాత్రి రోజున నల్ల నువ్వులు, బెల్లం దానం ఇస్తే ఆర్థిక బాధలు, మానసిక బాధల నుంచి ఉపశమనం పొందవచ్చు. నల్ల నువ్వులు దానం చేస్తే నిలిచిపోయిన ప్రాజెక్టులు పూర్తి అవుతాయి. జీవితంలో స్థిరత్వం కూడా వస్తుంది.

బెల్లం, నెయ్యి దానం చేయడం వల్ల ఆరోగ్యం పొందవచ్చు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు ఈ వస్తువులను ఆలయంలో రహస్యంగా దానం చేస్తే.. అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చు. మీ చుట్టూ నెగటివ్ ఎనర్జీని కూడా తొలగిస్తుంది.

దానం చేసే సరైన పద్ధతి :

దానం చేసేటప్పుడు ఎల్లప్పుడూ అహంకారం లేకుండా చూసుకోండి. నిస్వార్థంగా చేసే చిన్న దానమైనా శివుని దృష్టిలో చాలా గొప్పది. మహాశివరాత్రి రోజున ఉదయం పూజ తర్వాత లేదా ప్రదోష సమయంలో దానం చేయడం చాలా మంచిది.

దానం చేసే ముందు మానసికంగా శివుని పాదాల వద్ద దానం సమర్పించాలి. ఆ తర్వాత అవసరమైన వారికి ఆ దానం ఇవ్వండి. వస్తువు శుభ్రంగా, వారికి ఉపయోగపడేలా చూసుకోండి. అసలైన భక్తితో సేవా స్ఫూర్తితో చేసే దానం అన్ని బాధల నుంచి విముక్తిని అందిస్తుంది.

, , , ,