chanakya-niti-three-things-in-life
Chanakya Niti : ఆచార్య చాణక్యుని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన రాసిన నీతి శాస్త్ర గ్రంధం ప్రతి వ్యక్తి జీవితానికి మార్గనిర్దేశం. ఆచార్య చాణక్య నీతిశాస్త్రం తో పాటు రాజనీతి శాస్త్రం, ఆర్థిక శాస్త్రం కూడా రచించాడు. వీటిలో ఎన్నో విశేషమైన అంశాలను ప్రస్తావించారు. ఒక వ్యక్తి జీవితం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగాలంటే ఈ మూడు విషయాలలో ఎప్పుడూ మొహమాట పడొద్దు అంటున్నారు. ఆ మూడు విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణ జీవితం : ఆచార్య చాణక్య ప్రకారం ఒక వ్యక్తి సాధారణ జీవితాన్ని గడపడానికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలి అంటున్నారు. ఎదుటివారి కోసం ఆడంబరాలకు పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటున్నారు. మనిషి వ్యక్తిత్వం ధరించే దుస్తులను బట్టి ఉండదని చెబుతున్నారు. అందుకే సాధారణ దుస్తులు ధరించే సమయంలో ఎన్నడు సిగ్గుపడ వద్దని చెప్తున్నారు.
రుణ స్వీకరణ : రుణం తీసుకునే విషయంలోనూ అసలు మొహమాట పడొద్దు అని చెబుతున్నారు. అత్యవసర సమయాలలో డబ్బు అడిగేందుకు అస్సలు వెనకాడ వద్దని చెబుతున్నారు. డబ్బుకు సంబంధించిన పనులలో వెనకాడితే ఇబ్బందులు పడాల్సి వస్తుందని అంటున్నారు. అవసరం ఉన్నప్పుడు ఎదుటివారిని అప్పు అడగడంలో సందేహ పడొద్దు అని చెబుతున్నారు.
జ్ఞాన సముపార్జనలో : వ్యక్తికి జ్ఞానం అనేది చాలా ముఖ్యం అది లేకపోతే అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే చాణక్యుడు జ్ఞానం విషయంలో అనేక సూచనలు, సలహాలు ఇచ్చారు. గురువు నుంచి జ్ఞానాన్ని సంపాదించి సమయంలో ఎలాంటి మొహమాటం అక్కర్లేదు అంటున్నాడు. ఎలాంటి సందేహాలు ఉన్న గురువుని అడిగి తెలుసుకోవాలి అని చెబుతున్నాడు. గురువు నుంచి జ్ఞానం పొందేవారు జ్ఞానవంతులవుతారని అటువంటి వారికి జీవితంలో ఎలాంటి సమస్య ఎదురైనా ఈజీగా ఎదుర్కొంటారని చెపుతున్నారు.
Read Also : Chanakya Niti : ఆచార్యుడు ఆనాడే చెప్పాడు.. ఇలా చేస్తే.. ధనవంతులు కావడం ఖాయం..!
Top 10 Foods Diabetics : చక్కెర, జంక్, గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) ఆహారాలకు దూరంగా ఉండాలి. డయాబెటిక్ ఉన్నవారు…
Varahi Navaratri 2025 : ఈ వారాహి గుప్తనవరాత్రుల్లో పూజలను ఎవరు చేయాలి? అందరూ చేయొచ్చా? ఎవరూ చేయకూడదు? వారాహి…
Ashada Amavasya 2025 : జూలై 25 ఆషాఢ మాసంలో అమావాస్య రోజు. ఈ రోజున పూర్వీకుల ఆత్మలు భూమికి…
Ashadha Amavasya : ఈ రోజు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. పితృ పూజకు ప్రసిద్ధి చెందింది. ఈ రోజున…
WI vs AUS Test : జూన్ 25న బార్బడోస్‌లో ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో వెస్టిండీస్ ఆస్ట్రేలియాకు…
TG EDCET Result 2025 : టీఎస్ EDCET రిజల్ట్స్ 2025 విడుదల అయ్యాయి. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక…
This website uses cookies.