Double murders: పెళ్లి చేయలేదని నాన్నను, బాబాయ్ ను చంపిన కుమారుడు..!

Double murders: రాఖీ పండుగ రోజు అందరూ రాఖీలు కట్టించుకుంటుండగా.. ఓ యువకుడు మాత్రం ఇంట్లో వారితో గొడవ పెట్టుకున్నాడు. తనకు పెళ్లి చేయమంటూ వాగ్వాదానికి దిగి.. తండ్రితో పాటు బాబాయిని హత్య చేశాడు. ఇంతటి దారుణ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండల కేంద్రంలో రాఖీ పండుగ రోజున దారుమం జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో 55 సంవత్సరాల కర్రల అబ్బయ్య, అతని సోదరుడు 50 ఏళ్ల కర్రల సాయిలుని అబ్బయ్య కొడుకు కర్ర సతీష్ దారుణంగా హత్య చేశాడు.

Advertisement

కని పెంచిన తండ్రితో పాటు బాబాయ్ సాయిలని సతీష్ పారతో తలపై బలంగా కొట్టి చంపేశాడు. ఈ జంట హత్యలకు కుటుంబ తగాదాలే కారణం అని తెలుస్తోంది. అయితే నిందితుడు సతీష్ కు మతిస్థిమితం లేదని తెలుస్తోంది. ఈ క్రమంలోనే తనకు పెళ్లి చేయమని గత కొంత కాలంగా తండ్రిని వేధిస్తున్నాడు. పండుగ నాడు కూడా తనకు కచ్చితంగా పెళ్లి చేయాల్సిందేనని వెంట పడ్డాడు. ఎంత చెప్పినా వినకపోవడంతో తండ్రి కాస్త సీరియస్ అయ్యాడు. అదే ఆయన పాలిట శాపంగా మారి తనతో పాటు తమ్ముడి ప్రాణాలు పోవడానికి కారణం అయింది.

Advertisement