Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Crime News: బతుకమ్మ ఆడుతుండగా భార్య తలపై రాడ్డుతో కొట్టి హత్య!

Crime News: సిద్దిపేట జిల్లా వీరాపూర్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఎంగిలి పూల బతుకమ్మ పండుగ సంబురాల్లో భాగంగా గ్రామంలోని మహిళలంతా కలిసి బతుకమ్మ ఆడుతున్నారు.

By Vinod Kumar

Published on: September 26, 2022 2:00 PM

Updated on: September 26, 2022 1:51 PM

Husband killed hs wife while playing bathukamma in siddipet

---Advertisement---

Crime News: సిద్దిపేట జిల్లా వీరాపూర్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఎంగిలి పూల బతుకమ్మ పండుగ సంబురాల్లో భాగంగా గ్రామంలోని మహిళలంతా కలిసి బతుకమ్మ ఆడుతున్నారు. వారితో పాటు గ్రామానికి చెందిన స్వప్న అనే మహిళ కూడా బతుకమ్మ ఆడుతోంది. ఆమె వెనకాల నిలుచున్న భర్త రాడ్డుతో ఆమె తలపై గట్టిగా కొట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే మృతురాలు స్వప్న భర్త ఎల్లారెడ్డి ఆమెపై కోపంతోనే ఇలా చేసినట్లు గ్రామస్థులు చెబుతున్నారు.

Husband killed hs wife while playing bathukamma in siddipet

Advertisement

గతంలో స్వప్న అక్కతో ఎల్లారెడ్డికి పెళ్లి చేయగా.. వివాహం జరిగిన నెలకే ఆమె ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. ఆ తర్వాత ఆమె చెల్లె స్వప్నను ఎల్లారెడ్డికి ఇచ్చి పెళ్లి చేశారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. కానీ పెళ్లైన ఆరేళ్ల తర్వాత వీరిద్దరి మధ్య గొడవలు జరిగాయి. దీంతో భార్య అతడికి దూరంగా ఉంటోంది. ఈ క్రమంలోనే గ్రామానికి చెందిన రమేష్ అనే వ్యక్తికి దగ్గరై 14 ఏళ్లుగా అతడితో కలిసి సహజీవనం చేస్తోంది. ఈ క్రమంలోనే ఆమెపై కోపం పెంచుకున్న భర్త ఎల్లారెడ్డి ఆమెను చంపేశాడు.

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :