Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Sarkaru Vaari Paata Penny Song Promo : సర్కారు వారి పాట మూవీలో పెన్నీ పాటకు సితార అదిరే డాన్స్… వీడియో వైరల్!

Sarkaru Vaari Paata Penny Song Promo

Sarkaru Vaari Paata Penny Song Promo

Sarkaru Vaari Paata Penny Song Promo : సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా రాబోతున్న కొత్త సినిమా.. సర్కారు వారి పాట.. ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే కళావతి సాంగ్ సూపర్ హిట్ అయింది. అయితే ఇప్పుడు మరో స్పెషల్ అప్ డేట్ రిలీజ్ అయింది. ఈ స్పెషల్ సాంగ్ వీడియోకు సంబంధించి ప్రోమోను మహేశ్ బాబు షేర్ చేశాడు. మహేశ్ తన కూతురు సితార ఘట్టమనేనితో కలిసి నటించిన మొదటి సినిమా కూడా ఇదే..

ఈ మూవీలో మొదటిసారి సితార సిల్వర్ స్ర్కిన్ పై సందడి చేయనున్నారు. ప్రతి రూపాయాని అందరూ గౌరవించాలంటూ సాగే పెన్నీ పాటకు సితార అద్భుతంగా డాన్స్ చేసి ఆకట్టుకుంది. ఈ పాటకు సంబంధించిన ప్రోమోను మహేశ్ బాబు తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేశాడు. సితార మరోసారి తన పెర్ఫార్మెన్స్ తో అలరించబోతుందంటూ మహేశ్ ట్వీట్ చేశాడు.

ఆదివారం రోజున సర్కారు వారి పాట మూవీ నుంచి పెన్నీ ఫుల్ సాంగ్ రిలీజ్ కానుంది. సితార ఇప్పటికే హాలీవుడ్ యానిమేషన్ మూవీ ఫ్రోజెన్ 2కు తెలుగు వెర్షన్ బేబీ ఎల్సాకు వాయిస్ ఓవర్ ఇచ్చింది. సర్కారు వారి పాట మూవీ బ్యాంకు కుంభకోణం నేపథ్యంలో రానుంది. మైత్రిమేకర్స్ 14 రీల్స్ ప్లస్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నాయి. సర్కారువారి పాట మూవీలో మహేశ్ సరసన కీర్తి సురేశ్ నటిస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ సంగీతాన్ని అందించారు. మే 12న సర్కారు వారి పాట మూవీ రిలీజ్ కానుంది.

Advertisement

Read Also : RRR Pre Release Event : ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ప్రమోషన్స్ పీక్స్.. ఫస్ట్‌డే కలెక్షన్లే జక్కన్న టార్గెట్..!

Exit mobile version